ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విలీన గ్రామాలపై వివక్ష తగదు

ABN, First Publish Date - 2022-12-07T23:16:43+05:30

పట్టణంలోని విలీనమైన గ్రామాలపై వివక్ష చూపించడం స బబు కాదని బీజేపీ కౌన్సిలర్‌ పద్మ పరశు రాం ఆవేదన వ్యక్తం చేశారు.

చైర్మన్‌ గట్టు యాదవ్‌తో వాదిస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మునిసిపల్‌ కార్యాలయం ముందు బీజేపీ కౌన్సిలర్‌ బైఠాయింపు

- వార్డు సమస్యను పట్టణ సమస్యగా చిత్రీకరిస్తున్నారని చైర్మన్‌ అసహనం

వనపర్తి టౌన్‌, డిసెంబరు 7: పట్టణంలోని విలీనమైన గ్రామాలపై వివక్ష చూపించడం స బబు కాదని బీజేపీ కౌన్సిలర్‌ పద్మ పరశు రాం ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేం ద్రంలోని మునిసిపల్‌ కార్యాలయం గేటు మూ సి బీజేపీ నాయకులతో కలిసి ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ మా ట్లాడుతూ నూతనంగా మునిసిపల్‌ చట్టం 2019 జీవో నెంబర్‌ 258 ప్రకారం విలీన గ్రా మాల, తండాల ప్రజలకు ఇష్టం లేకపోయినా మునిసిపాలిటీలలో విలీనం చేశారని అన్నారు. విలీనం జరిగితే పన్నుల భారం భరించలేమని విలీన గ్రామాల ప్రజలు ఒప్పుకోకపోయినా బ లవంతంగా విలీనం చేశారని, తీరా ఇప్పుడు అభివృద్ధిని పూర్తిగా మరిచారని అన్నారు. 4వ వార్డు పరిధిలోని నర్సింగాయపల్లిలో కనీసం మంచినీటి సమస్య కూడా పరిష్కరించకపో వ డం ఏంటని ప్రశ్నించారు. మునిసిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను సైతం పట్టించు కోవడం లేదన్నారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ నిధులను ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి కాకుం డా పలుకుబడి ఉన్న వారి వార్డులలో అధిక ని ధులు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్ల విస్తరణ పనులకు ఒక్క పైసా ప్రత్యేక నిధులు తీసుకురాకుండా పాలక వర్గం విఫలం అ య్యిందని ఎద్దేవా చేశారు. దీంతో మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌ కలుగజేసుకొని ఇప్పటికే 4వ వార్డు అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, ఇంకా చేస్తామని అన్నారు. కానీ వార్డు సమస్య ను పట్టణ సమస్యగా చిత్రీకరించే పనులు మా నుకోవాలని హితవు పలికారు. వార్డు సమస్య ఉంటే వార్డు ప్రజలు ఉండాలని, బీజేపీ నాయ కులతో వచ్చి ఇలా అవివేకంతో ధర్నా చేయ డం సబబు కాదని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పరశురాం, రామ్మోహన్‌, కొమ్ము సామేల్‌, కుమార్‌, సుమి త్రమ్మ, పద్మమ్మ, సుగూరు రాము, రాయన్న సాగర్‌, రాజశేఖర్‌ గౌడ్‌, భూపతిగౌడ్‌, రవి, విక్రమ్‌, నవీన్‌చారి,వినోద్‌, హరీశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising