ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిడుగుర్తి పాఠశాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-08-26T05:13:14+05:30

నిడుగుర్తి పాఠశాల విద్యతో పాటు ఆటపాటలు వంటి ప్రయోజనం కలిగించే ప్రతీ విషయంలో మిగిలిన పాఠశాలలకు స్ఫూర్తి దాయకం అని డీఈవో గోవిందరాజులు అన్నారు.

చిన్నారుల ఆటలను తిలకిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డీఈవో గోవిందరాజులు

- క్రీడా ప్రాంగణం ప్రారంభం

ఊట్కూర్‌, ఆగస్టు 25 : నిడుగుర్తి పాఠశాల విద్యతో పాటు ఆటపాటలు వంటి ప్రయోజనం కలిగించే ప్రతీ విషయంలో మిగిలిన పాఠశాలలకు స్ఫూర్తి దాయకం అని డీఈవో గోవిందరాజులు అన్నారు. గురువారం నిడుగుర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన నూతన క్రీడా ప్రాంగణంను ఆయన ప్రారంభించారు. క్రీడా పరికరాలను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు.  అనంతరం పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు శారీరక పెరుగుదల కూడా అవసరమని గుర్తించి ప్రత్యేక క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకోవడం ప్రశంసించ తగిన విషయం అన్నారు. మాజీ జిల్లా అధికారి లియాఖత్‌ అలీ మాట్లాడుతూ ఈ పాఠశాల నుంచి ఎన్‌ఎంఎంఎస్‌ వంటి పోటీ పరీక్షలకు ప్రతీ సంవత్సరం విద్యార్థులు ఎంపికవుతున్నారన్నారు. హెచ్‌ఎం ల క్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఈవో వెంకటయ్య, సర్పంచ్‌ యశోదమ్మ, ఎంపీటీసీ సభ్యుడు వీరరాఘవరెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి జనార్దన్‌రెడ్డి,  మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్‌, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు చంద్రశేఖర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, పాఠశాల చైర్మన్లు నర్సిములు, మఖ్బుల్‌ ఖాన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-26T05:13:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising