ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలంపూర్‌ మున్సిసిపాలిటీకి జాతీయ గుర్తింపు

ABN, First Publish Date - 2022-10-01T05:53:31+05:30

అలంపూర్‌ మునిసిపాలిటీకి జాతీయ గుర్తింపు లభించింది. ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌ పురస్కారానికి ఎంపికైంది

కేంద్ర మంత్రి కుశాల్‌ కిషోర్‌ చేతుల మీదుగా స్వచ్ఛత లీగ్‌ ఆవార్డు అందుకుంటున్న మున్సిపల్‌ కమిషనర్‌ నిత్యనందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌ పురస్కారానికి ఎంపిక

అలంపూర్‌, సెప్టెంబరు 30 : అలంపూర్‌ మునిసిపాలిటీకి జాతీయ గుర్తింపు లభించింది. ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌ పురస్కారానికి ఎంపికైంది. గార్బేజ్‌ ఫ్రీ సిటీస్‌లో భాగంగా ఈ పురస్కారాలను అందించారు. ఇందులో 15 వేల నుంచి 25 వేల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో అలంపూర్‌ పట్టణాన్ని ఎంపిక చేశారు. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహ, పట్టణాభివృధ్ది శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ చేతుల మీదుగా అలంపూర్‌ కమిషనర్‌ నిత్యనందం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. లీగ్‌లో భాగంగా మేము చేపట్టిన పనులను కేంద్రం బృందం పరిశీలించి, ఫలితాలను వెల్లడించారని కమిషనర్‌ నిత్యానందం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అందులో అలంపూర్‌కు 92 మార్కు లు వచ్చాయని చెప్పారు. పురస్కారానికి ఎంపికైనందున మునిసిపాలిటీకి త్వరలోనే తొమ్మిది కోట్ల రూపాయల నిధులు రానున్నాయని తెలిపారు. పట్టణ ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని, ఇదే కృషిని భవిష్యత్‌ లోనూ కొనసాగి స్తామని అన్నారు. 


Updated Date - 2022-10-01T05:53:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising