ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పల్లె ప్రగతి’తోనే దేశాభివృద్ధి

ABN, First Publish Date - 2022-06-04T04:57:41+05:30

పల్లెల ప్రగతితోనే దేశం అభివృద్ధి చెందుతుందని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

పూడూరులో నిర్వహించిన పల్లె ప్రగతి గ్రామసభలో సమస్యలను తెలుసుకుంటున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

గద్వాల, జూన్‌ 3: పల్లెల ప్రగతితోనే దేశం అభివృద్ధి చెందుతుందని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. మండల పరిధిలోని పూడూరులో శుక్రవారం నిర్వహించిన ఐదవ విడుత పల్లె ప్రగతి గ్రామసభకు ఆమె హాజరై మాట్లాడారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచు కునేందుకు మల్టీపర్సస్‌ వర్కర్లను ఏర్పాటుచేసి చెత్త సేకరణ చేస్తున్నారని, ఇంటింటికీ రెండు చెత్తబుట్టలు ఇచ్చారని తెలిపారు. తడిపొడి చెత్తను వేరుచేసి వాటిల్లో వేసి ఇంటి ముందుకు వచ్చే ట్రాక్టర్లలో వేయాలని సూచిం చారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటి సంరక్షిస్తున్నామని తెలిపారు. పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినట్లు తెలిపారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిం చారు. అనంతరం గ్రామంలో తిరిగి సమస్యలను గుర్తించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చెన్నయ్య, గ్రామ సర్పంచు శశికళ, ఎంపీటీసీ సభ్యుడు శంకర్‌గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి శారద నాయకులు లక్ష్మీకాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా శెట్టి ఆత్మకూర్‌ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సెలవుపై వెళ్లారు. బస్సాపురంలో బొడ్రాయి ప్రతిష్ఠ ఉన్నందున ఈ రెండు గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించలేదు. కొండపల్లిలో నిర్వహించిన పల్లెప్రగతి గ్రామసభకు సర్పంచు మహేశ్వరి హాజరుకాలేదు. 


Updated Date - 2022-06-04T04:57:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising