ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరితహారంలో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-05-27T04:52:05+05:30

తెలంగాణకు హరితహారం కార్య క్రమంలో భాగంగా వనపర్తి జిల్లాలో మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్దేశించడం జరిగిందని, అన్ని శాఖల సమన్వయంతో లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా అధి కారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా 

 

వనపర్తి అర్బన్‌, మే 26: తెలంగాణకు హరితహారం కార్య క్రమంలో భాగంగా వనపర్తి జిల్లాలో మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్దేశించడం జరిగిందని, అన్ని శాఖల సమన్వయంతో లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా అధి కారులను ఆదేశించారు. గురువారం నూతన సమీకృత కలె క్టర్‌ కార్యాలయం సమావేశ మందిరంలో డీఆర్‌డీఏ, డీఎఫ్‌వో, జిల్లా అధికారులతో హరితహారం కార్యక్రమంపై కలెక్టర్‌ స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ జిల్లాలో హరితహారం మొక్కలు నాటేందుకు లక్ష్యం ఏ ర్పాటు చేయడం జరిగిందని, దీనికి అనుగుణంగా అన్ని శాఖ లు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని అధికారు లకు సూచించారు. జిల్లాలో అటవీ ప్రాంతం చాలా తక్కువ ఉందని, దీని దృష్ట్యా 33శాతం అడవులు పెంచేందుకు కృషి చేయాలని అన్నారు. బృహత్‌ పల్లె ప్రకృతివనాల్లో విరివిగా మొక్కలను నాటేలా చూడాలని, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటించి, మోడల్‌ బృహత్‌ పల్లె ప్రకృతివనాలను తీర్చిదిద్దాలని అన్నారు. పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో సమీక్షించాలని ఆదే శించారు. సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలె క్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, రెవెన్యూ వేణుగోపాల్‌, జిల్లా అటవీశాఖ అధికారి రామకృష్ణ, జిల్లా ఇరిగేసన్‌ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నర్సింహులు, ఈఈ. జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

అనంతరం అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ మా ట్లాడుతూ జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. సాయంత్రం 6 గంటలకు కవి సమ్మేళనం, ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  

Updated Date - 2022-05-27T04:52:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising