ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-10-18T04:28:01+05:30

పత్తి పంటకు ప్రైవేట్‌ మార్కెట్‌లో మద్దతు ధర లభించకుం టే మద్దతు ధర చెల్లించి నాణ్యత ప్రమాణాల మేరకు పత్తి కొనుగోలుకు సీసీఐ అధికారులు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పత్తి పంటకు ప్రైవేట్‌ మార్కెట్‌లో మద్దతు ధర లభించకుం టే మద్దతు ధర చెల్లించి నాణ్యత ప్రమాణాల మేరకు పత్తి కొనుగోలుకు సీసీఐ అధికారులు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్‌ క్యాంపుకార్యాలయంలో పత్తి కొను గోళ్లపై అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌తో కలిసి సీసీఐ మా ర్కెటింగ్‌, అగ్నిమాపక, వ్యవసాయ శాఖ, అధికారులు, జిన్నింగ్‌ మిల్లుల యాజమానులతో సమావేశం నిర్వ హించి కలెక్టర్‌ సమీక్షించారు. ప్రస్తుతం పత్తికి ప్రైవేట్‌ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.6382 నుంచి 7500 రూపా యల వరకు రైతుకు ధర వస్తున్నట్లు, ఒకవేళ మద్దతు ధర రాకుంటే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం 6382రూపాయలు క్వింటాల్‌కు మద్దతు ధర చెల్లించి పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికా రులు సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులను ఆదే శించారు. రవాణాకు సంబంధించి ఖర్చు విషయంలో ఇది వరకే నిర్ణయించిన ఽవిధంగా ధరలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అలాగే జిన్నింగ్‌ మిల్లుల వద్ద రైతుల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు యాజమాన్యాలు తప్పనిసరిగా సమకూర్చాలన్నారు. అ గ్నిమాపక శాఖ అధికారులు జిన్నింగ్‌ మిల్లులను తనిఖీ చేసి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా భద్ర త చర్యలు పరిశీలన చేయాలని ఆదేశించారు. తూనిక లు, కొలతలు శాఖ అధికారులు వేబ్రిడ్జిలను తనిఖీ చే యాలని ఆదేశించారు. మిల్లుల వద్ద వాహనాలు జామ్‌ కాకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో 3లక్షల 30వేల 86ఎకరాల్లో పత్తి సాగు జరిగిందని, 3లక్షల 96వేల 103 క్వింటాళ్ల పత్తి దిగుబడి రానున్నట్లు వ్యవసాయ అధికా రులు అంచనా వేశారని కలెక్టర్‌ తెలిపారు. అందుకను గుణంగా జిన్నింగ్‌మిల్లుల యాజమాన్యాలు సిద్ధంగా ఉండాలన్నారు. రైతులు తాము పండించిన పత్తికి మం చి ధర రావాలంటే తేమశాతం లేకుండా, నాణ్యతగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్‌ కోరారు. అనంతరం క నీస మద్దతు ధర, పత్తి కొనుగోళ్ల రైతులకు అవగాహన కల్పించే గోడపత్రికలను కలెక్టర్‌ ఆవిష్కరించారు.  అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, మార్కెటింగ్‌ అధికారిణి బాలమణి, వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, అ గ్నిమాపక శాఖ అధికారి కృష్ణమూర్తి, జిన్నింగ్‌ మిల్లుల యాజమానులు, సీసీఐ, మేనేజర్లు వరుణ్‌, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయులు త్వరలో జరిగే మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారె డ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు పొం దేందుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌ కుమార్‌ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో కో రారు. 1-11-2016 నుండి 31-10-2022 సంవత్సరాల మధ్యలో 3సంవత్సరాల పాటు అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో బోధన సిబ్బందిగా ప ని చేసిన ఉపాధ్యాయులు మాత్రమే ఎమ్మెల్సీ ఓటరు న మోదుకు అర్హులని పేర్కొన్నారు. పాత ఓటరు లిస్టు ర ద్దు కావడంతో అంతా నూతనంగా దరఖాస్తు చేసుకోవా లని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో దాదాపుగా 5వేల మందికి పైగా ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకునేందుకు అర్హులుగా ఉన్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఓటు నమోదుకు 19దరఖాస్తుఫారంను పూర్తి చేసి సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్డీ వో కార్యాలంయలో లేదా ఆన్‌లైన్‌ ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. నవంబరు 7వ తేదీ ఓటు నమోదు కు చివరి తేదీ అని, జిల్లాలో ఇప్పటి వరకు ఓటు నమోదు కార్యక్రమంలో అత్యల్పంగా నమోదైనందున మంగళవారం ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 2గంట లకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్షన ప్రధాన కార్యద ర్శులతో సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ పి.ఉద య్‌కుమార్‌ పేర్కొన్నారు. సమావేశానికి అన్ని సంఘాల నాయకులు హాజరు కావాలని సూచించారు. 

Updated Date - 2022-10-18T04:28:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising