ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో మొహర్రం

ABN, First Publish Date - 2022-08-10T05:27:09+05:30

త్యాగానికి మారు పేరుగా జరుపుకునే మొహరం పండుగను మంగళవారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.

మునగాల గ్రామంలోకొనసాగుతున్న పీర్ల ఊరేగింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా పీర్ల ఊరేగింపు

- మొక్కులు తీర్చుకున్న ప్రజలు

గద్వాల టౌన్‌, ఆగస్టు 9 : త్యాగానికి మారు పేరుగా జరుపుకునే  మొహరం పండుగను మంగళవారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. గద్వాల పట్టణంలోని గంజిపేటలోని మసీదు నుంచి సాగిన ఊరేగింపులో జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక గాంధీచౌక్‌ వద్దకు చేరుకున్న పీర్ల ఊరేగింపుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మరోవైపు నుంచి వచ్చిన పీర్ల ఊరేగింపు గాంధీచౌక్‌ చేరుకున్నది. ఈ సందర్భంగా తల్లీ కొడుకులైన బీబీఫాతిమా, హుసేన్‌ఆలం కలుసుకున్న స న్నివేశాన్ని ప్రజలు ఉత్సాహంగా తిలకించారు. హర్షధ్వా నాలు వ్యక్తం చేస్తూ చప్పట్లు చరుస్తూ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో ఆ మార్గంలో వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. 


మానవపాడు : మండలంలోని మానవపాడు, చెన్ని పాడు, నారాయణపురం, పల్లెపాడు, జల్లాపురం, అమర వాయి గ్రామాల్లో మంగళవారం మొహర్రం పండుగను ఘనంగా నిర్వహించారు. భక్తులు పీర్లకు ప్రత్యేక పూజలు చేసి, మాలిజాను నైవేద్యంగా సమర్పించారు. పూలదండలు, కాయకర్పూరం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం సాయంత్రం పీర్లను ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. 


రాజోలి : మండలకేంద్రంలోని కోటవీధి, బస్టాండు, అచ్చుగట్లవీధి, చిన్నమజీద్‌ ప్రాంతాల్లో మంగళవారం మొహర్రం వేడుకలు సందడిగా సాగాయి. మంగళవారం సాయంత్రం గ్రామంలో పీర్లను ఊరే గించి, గ్రామ శివారులోని తుంగభద్ర నదికి తీసుకెళ్ల ఉపసంహరించారు. 


ఇటిక్యాల : మండల వ్యాప్తంగా మొహర్రం వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. మునగాల, గార్లపాడులలో నిర్వహించిన వేడుకలకు కర్ణాటక రాష్ట్రం లోని రాయిచూరు, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌ ప్రాంతం నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. 


ఉండవల్లి : మండల కేంద్రంలో మంగళవారం మొహర్రం పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించు కున్నారు. పీర్ల మసీదులో తొమ్మిది రోజుల పాటు కొలువుదీరిన మౌలాలి, హసన్‌, హుస్సేన్‌, అలి అక్భర్‌ పీర్లను  మంగళవారం అశేషాజనవాళి మధ్య నిమజ్జనా నికి తరలించారు.


ధరూరు :  ధరూరు మండల పరిధిలోని  నెట్టెం పాడు గ్రామంలో మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వ హించారు. మంగళవారం సాయంత్రం పీర్ల ఊరే గింపు నిర్వహించి, నిమజ్జనానికి తరలించారు.  


అలంపూరు : అలంపూర్‌ పట్టణంలో మొహర్రం పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. మంగళ వారం సాయంత్రం నిర్వహించిన పీర్ల ఊరేగింపులో  వేలాది మంది పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. 




Updated Date - 2022-08-10T05:27:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising