దోమల నివారణ చర్యలు నిరంతరం కొనసాగాలి
ABN, First Publish Date - 2022-08-05T05:17:49+05:30
పారిశుధ్య కార్యక్రమాలతోపాటు ‘దోమలపై సమరం’ కార్యక్రమాన్ని నిరంతరం చేపట్టాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అధికా రులను ఆదేశించారు.
- జిల్లా కేంద్రంలోని వార్డుల్లో పర్యటించిన కలెక్టర్ ఎస్ వెంకట్రావు
మహబూబ్‌నగర్, ఆగస్టు 4 : పారిశుధ్య కార్యక్రమాలతోపాటు ‘దోమలపై సమరం’ కార్యక్రమాన్ని నిరంతరం చేపట్టాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అధికా రులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ పట్టణంలోని లక్ష్మీనగర్ కాలనీ, బీకే రెడ్డి కాలనీ, భగీరథకాలనీ, పద్మావతీ కాలనీలలో పర్యటించి పారిశుధ్య పనుల ను పరిశీలించారు. వార్డుల్లో జరుగుతున్న పారిశుధ్య పనులతోపాటు దోమల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా హరితహారం, రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కోసం తీసు కుంటున్న చర్యలపై కూడా ఆరా తీశారు. ఓపెన్‌ప్లాట్లలో చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు ఉంటే వాటిని వెంటనే తొలగించుకునేలా ప్లాట్ల యజమాను లకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.విద్యుత్ తీగలు వేలాడకుండా వైర్లకు అడ్డుగా ఉన్న మొక్కలను నరికివేసినప్పుడు వాటిని రోడ్లపై అలానే వదిలేయ కుండా వెంటనే తొలగించేలా ట్రాన్స్‌కో అధికారులకు సూచిం చాలన్నారు. మునిసిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, శానిటరి ఇన్‌స్పెక్టర్ పాల్గొన్నారు.
Updated Date - 2022-08-05T05:17:49+05:30 IST