ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాచీన కట్టడాలను పరిరక్షించాలి

ABN, First Publish Date - 2022-05-28T05:09:02+05:30

సంస్థానాధీశుల పాలనకు చారిత్రక సాక్ష్యంగా నిలిచిన ప్రాచీన కట్టడాలను పరిరక్షించాలని గద్వాల చారిత్రక కట్టడాల పరిరక్షణ కమిటీ సభ్యుడు మోహన్‌రావు కోరారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మోహన్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- గద్వాల చారిత్రక కట్టడాల పరిరక్షణ కమిటీ సభ్యుడు మోహన్‌రావు

గద్వాల టౌన్‌, మే 27 : సంస్థానాధీశుల పాలనకు చారిత్రక సాక్ష్యంగా నిలిచిన ప్రాచీన కట్టడాలను పరిరక్షించాలని గద్వాల చారిత్రక కట్టడాల పరిరక్షణ కమిటీ సభ్యుడు మోహన్‌రావు కోరారు.  పట్టణంలోని టీఎన్జీవో భవనంలో కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గద్వాల సంస్థానాదీశులు పట్టణం చుట్టూ ఏర్పాటు చేసిన బురుజులు, కందకం, ఇతర దేవాలయాలు, ఆనాటి సాంస్కృతిక సంప్రదాయాలకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయన్నారు. సంస్థానాదీశుల ఇలవేల్పు అయిన భూలక్ష్మి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అప్పటి పాలకులు ఐదు రథాలతో ఉత్సవాలు నిర్వహించేవారని, వాటిని నిలిపేందుకు పట్టణంలో ఐదు రథశాలలను నిర్మించారని తెలిపారు. ఆలయ నిర్వహణా బాధ్యతలు చేపట్టిన మంత్రాలయం మఠం వారు ఇటీవల రథశాలలను తొలగించి  షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించే ఆలోచన ఉన్నట్లు విశ్వనీయంగా తెలిసిందన్నారు. ఆలయ నిర్వహణ ఒప్పందంలో భాగంగా వేద పాఠశాల ఏర్పాటుతో పాటు ఇతర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా, శ్రీమఠం వారు రథశాలల కూల్చివేతకు సిద్ధపడటం చరిత్రను ధ్వంసం చేయడమేనన్నారు.  ఆ ప్రయత్నాన్ని తమ కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. సమావేశంలో మధుసూదన్‌బాబు, భీంసేన్‌రావు, ఆలూరు ప్రకాష్‌ గౌడ్‌, బుచ్చన్న, రామలింగేశ్వర కామ్లే,  బాలగోపాల్‌ రెడ్డి, శివన్న పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T05:09:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising