ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న మోదీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-12-02T00:11:52+05:30

భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌, ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి ఆరోపించా రు.

జడ్చర్లలో సీఐటీయూ జిల్లా మహాసభల్లో అభివాదం చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా మహాసభల్లో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌, ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి

జడ్చర్ల, డిసెంబరు 1 : భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌, ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి ఆరోపించా రు. జడ్చర్ల పట్టణంలోని చంద్రాగార్డెన్స్‌లో గురువా రం సీఐటీయూ 13వ జిల్లా మహాసభల్లో పాల్గొ న్న సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రం గ సంస్థలను విచ్చలవిడిగా అమ్ముకుంటు న్నారని అన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు లేబర్‌కోడ్‌లను కార్పొరెట్‌ శక్తుల కు, యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలని మార్చాలని, కార్మికుడికి ఒక రోజుకు రూ.175 వేత నం ఉంటే సరిపోతుందంటూ మోదీమాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రామిక మహిళలపై దాడులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయ న్నారు. రూ.9లక్షల కోట్లు పెట్టుబడిదారులకు రాయితీలు కల్పించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీఐటియు ఆందోళనలు చేపట్టాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కిల్లె గోపాల్‌, కురుమూర్తి, వేణుగో పాల్‌, తెలుగు సత్తయ్య, వాష్యాబేగం, తిరుమలయ్య, చంద్రకాంత్‌, రాములు, రాములు, పద్మ, ఆశ, అంగన్‌వాడీ, మునిసిపల్‌, గ్రామ పంచాయతీ, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:14:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising