ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మినీ ట్యాంక్‌ బండ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం

ABN, First Publish Date - 2022-05-17T04:44:26+05:30

పాలమూరు పట్టణంలో చేపడుతున్న మినీట్యాంక్‌బండ్‌ను అద్భుతంగా తీర్చిది ద్దుతామని ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి వి శ్రీని వాస్‌గౌడ్‌ అన్నారు.

సెంట్రల్‌ లైటింగ్‌ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- లక్నవరం తరహాలో సస్పెన్షన్‌ బ్రిడ్జి

- ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి  వి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, మే16: పాలమూరు పట్టణంలో చేపడుతున్న మినీట్యాంక్‌బండ్‌ను అద్భుతంగా తీర్చిది ద్దుతామని ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి వి శ్రీని వాస్‌గౌడ్‌ అన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం పర్యా టక ప్రాంతం కానుందని, ఇతర ప్రాంతాలు,  జిల్లాల నుంచి  ఇక్కడికి సందర్శకులు వచ్చేలా  పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు. సోమవారం సాయం త్రం కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావ్‌తో కలిసి ఆయన ట్యాంక్‌ బండ్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. చెరువు మఽ ద్యలో ఎకరా స్థలంలో ఐల్యాండ్‌ను ఏర్పాటు చేస్తామ ని, లక్నవరం తరహాలో సస్పెన్షన్‌ బ్రిడ్జిని ఏర్పాటు చే యనున్నట్లు వివరించారు. ఐల్యాండ్‌లో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. చెరువులో పూడిక తీత పనులు వేగవంతం చేయాలని, గుర్రండెక్క పూ ర్తిగా పోవాలంటే ఎర్రమట్టి తేలేవరకు పూడికతీత ప నులు రాత్రి, పగలు చేపట్టాలని అధికారులను ఆదే శించారు. ప్రతిఏటా విడతల వారిగా ట్యాంక్‌బండ్‌ను అభివృద్ధి చేస్తున్నామని, నెక్లెస్‌ రోడ్‌ చేపడితే వాకర్స్‌ కు, సైక్లింగ్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని వి వరించారు. పక్కనే మినీశిల్పారామం ఏర్పాటు కానుం దని, అక్కడ ఓపెన్‌ఎయిర్‌ థియేటర్‌, పెళ్లిళ్లు చేసుకోవ డానికి అవకాశం కల్పిస్తామని మంత్రి చెప్పారు.  కా ర్యక్రమంలో అదనపు  కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌పవార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, ముడా చైర్మన్‌ గంజి వెంకన్న,  టూరిజం ఎండీ మనోహర్‌, ఐబీ ఈఈ చక్రధర్‌, డీఈ మనోహర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

 సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభం

పట్టణ ప్రధాన రహదారి అయిన హైదరాబాద్‌- రాయిచూర్‌ రహదారిపై ఏర్పాటు చేసిన సెంటల్ర్‌ లైటింగ్‌ను సోమవారం  మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రా రంభించారు. రహదారి విస్తరణలో భాగంగా డివైడర్‌ పై సెంట్రల్‌లైటింగ్‌ను ఏర్పాటుచేయగా బస్టాండ్‌ వద్ద మంత్రి ప్రారంభించారు. సెంట్రల్‌ లైటింగ్‌తో ప్రధాన రహదారి మరింత శోభను సంతరించుకుంది. ఇప్ప టికే రహదారిని విస్తరించి డివైడర్‌ మధ్యలో అందమైన వృక్షాలను ఏర్పాటు చేశామన్నారు. 

Updated Date - 2022-05-17T04:44:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising