ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన్యంకొండను దివ్య క్షేత్రంగా మారుస్తా

ABN, First Publish Date - 2022-12-16T23:13:57+05:30

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే అతి పెద్ద దివ్యక్షేత్రంగా మన్యంకొండ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి డాక్టర్‌ వీ శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), డిసెంబర్‌ 16 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే అతి పెద్ద దివ్యక్షేత్రంగా మన్యంకొండ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి డాక్టర్‌ వీ శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్ర భుత్వం ఈ నెల 14న జీవో 390 విడుదల చేస్తూ రూ. 50 కోట్లను మంజూ రుకు ఉత్త ర్వులు జారీ చేసిందని ఆయన వెల్లడించారు. శుక్ర వారం నూతన కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మన పూర్వీకులు తీరితే తిరుపతి.. తీరకపోతే మన్నెం కొండ అనేవారని మంత్రి గుర్తు చేశారు. ఈ ఆర్థిక సంవంత్సరం రూ.25 కోట్లు, వచ్చే ఆర్థిక సంవంత్సరం మరో రూ.25 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్ట నున్నట్లు ఆయన వివరించారు. ఆదేవిధంగా పాలమూరు పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి కూడా ప్రభుత్వం రూ.6 కోట్లు మంజూరు చేస్తూ 391 జీవోను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలే కాకుండా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారని, వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఫలని సుబ్రమాణ్య స్వామి దేవాల యం వద్ద ఉన్నట్లు మొట్ట మొదటి రోప్‌ వేను ఏర్పాటు చేస్తున్నామని, అన్నదాన సత్రం, కల్యాణ కట్ట, షాపింగ్‌ కాంప్లెంక్స్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. ఇదివరకే రూ. 15 కోట్లతో టూరిజం హోటల్‌ నిర్మాణం చేపట్టామని తెలిపారు. మన్యంకొండను దివ్వక్షేత్రంగా చేయాలన్నదే తమ ఉద్దేశ మని మంత్రి స్పష్టం చేశారు. మన్యంకొండ పాలక వర్గం కూడా దేవాలయ అభివృద్ధ్దికి తమవంతు కృషి చేయాలని ఆయన కోరారు. పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో రూ.6 కోట్లతో అభివృద్ధ్ది పనులు చేపట్టనున్నామని, త్వరలోనే ఎలాంటి కార్యక్ర మాలు చేపట్టాలో ఆలయ కమిటీ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు వచ్చి ఉద్యోగం చేసుకునే విధంగా ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేస్తామని, కోయిల్‌సాగర్‌, ఉదండాపూర్‌, కర్వేనా రిజర్వాయర్లు పూర్తయితే అక్కడ ఫిష్‌కల్చర్‌, ఫ్రాన్స్‌కల్చర్‌తో పాటు, బోటింగ్‌ వంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు, అదనపు కలెక్టర్లు తేజస్‌ నందలాల్‌ పవర్‌, సీతారామారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్‌ గౌడ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సిములు, మన్నెంకొండ ఆలయ కమిటీ పాలక మండలి సభ్యులు, లక్ష్మీ నరసిం హస్వామి దేవాలయ పాలక మండలి సభ్యులు హాజరయ్యారు.

Updated Date - 2022-12-16T23:13:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising