‘మనఊరు మనబడి’తో పాఠశాలలో పెనుమార్పులు
ABN, First Publish Date - 2022-03-06T05:00:26+05:30
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి ’ కార్యక్రమంతో పాఠశాలలో పెను మార్పులు రాను న్నట్లు జడ్పీ చైర్‌పర్సన్ సరిత అన్నారు.
- ప్రైవేట్‌కు దీటుగా
మౌలిక వసతుల కల్పన
- పూర్వ విద్యార్థులు భాగస్వాములవ్వాలి
- జడ్పీ చైర్‌పర్సన్ సరిత
ఉండవల్లి, మార్చి 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి ’ కార్యక్రమంతో పాఠశాలలో పెను మార్పులు రాను న్నట్లు జడ్పీ చైర్‌పర్సన్ సరిత అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పా ఠశాలలో ఎంఈవో శివప్రసాద్ అధ్యక్షతన మన ఊరు మనబడి కార్యక్రమంపై సమీక్ష న్విహించా రు. ముఖ్య అతిఽథిగా జడ్పీ చైర్‌పర్సన్ సరిత పా ల్గొని మాట్లాడుతూ పాఠశాలలో విద్యనభ్యసించి ఉన్నత పదవుల్లో చాలా మంది ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థ ను పటిష్టం చేయాలనే దృడ సంకల్పంతో మన ఊరు మన బడి కార్యక్రమం తీసుకువచ్చారని అ న్నారు. మొదటి విడతలోనే ఈ పాఠశాల ఎం పికైనట్లు ప్రకటించారు. పూర్వ విద్యార్థులు కూడా పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని పి లుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో పాఠశాలలో పూర్తిస్థాయిలో మౌలికవసతుల ఏర్పాటుకు మా ర్గం సుగమమని అన్నారు. అంతకుముందు రెండు పాఠశాలలోని ప్రతి తరగతి గదులను పరిశీలించి చాలా వరకు జడ్పీహెచ్‌ఎస్ శిథిలా వస్థకు చేరి నట్లు గుర్తించారు. సమీక్షలో ఎంపీపీ బీసమ్మ, వైస్ ఎంపీపీ దేవన్న, సర్పంచు రేఖ, ఎంపీటీసీ సభ్యులు సుంకన్న, రాజశేఖర్, ఉప సర్పంచు స య్యద్ రహమత్ హుస్సేన్, ఎస్‌ఎంసీ చైర్మన్లు సా యిబాబా, నరసింహా, పంచాయతీ రాజ్ ఏఈ న రేందర్, వెంట్‌గౌడు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విద్యార్థులతో మమైక్యం....
జడ్పీ చైర్‌పర్సన్ శనివారం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని విద్యార్థులతో మమైక్యమయ్యారు. ఒక అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపా రు. ఒక తరగతిగదిలో విద్యార్థుల నైపుణ్యా న్ని ప రిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రం లో చిన్నారుల తో ముచ్చటించారు. మండల కేంద్రానికి చెందిన కళ్యాణి అనే అమ్మాయి ఎన్‌ఐటీలో సీటు పొంద డంతో అభినందించి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రామ్మోహన్ బహుమతిగా ఇచ్చిన ల్యాప్‌ట్యాప్‌ను జడ్పీ చైర్‌పర్సన్ అందజేశారు.
చెన్నిపాడు గ్రామంలో..
మానవపాడు: కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని జడ్పీ చైర్‌పర్సన్ సరిత అన్నారు. మండలంలోని చెన్నిపాడులోని ప్రభుత్వ పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో ఆమె ప్రత్యేకంగా మా ట్లాడారు. మంచి ఉత్తీర్ణతశాతం సాధించాలని సూ చించారు. పాఠశాలకు సంబంధించిన స్థలాన్ని స ర్వే చేయాలని గ్రామస్థులు కోరగా...తహసీల్దార్ వరలక్ష్మికి ఫోన్ చేసి మాట్లాడారు. కార్య క్రమం లో సర్పంచ్ వెంకటమ్మ, ఎంపీటీసీ స భ్యుడు స్వా ములు, ఎస్‌ఎంసీ చైర్మన్ రామాంజి, వెంకట్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, దుబ్బన్న, శాంతన్న పాల్గొన్నారు.
Updated Date - 2022-03-06T05:00:26+05:30 IST