ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మదనాపురం పట్టణంగా అభివృద్ధి చెందుతోంది

ABN, First Publish Date - 2022-05-27T05:36:30+05:30

నూతన మండల ఆవిర్భావ అనంతరం మదనాపురం పట్టణంగా అభివృద్ధి చెందుతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

మార్కెట్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

- రూ.66లక్షలతో మార్కెట్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం

మదనాపురం, మే 26 : నూతన మండల ఆవిర్భావ అనంతరం మదనాపురం పట్టణంగా అభివృద్ధి చెందుతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో మార్కెటింగ్‌ శాఖకు సంబంధించి రూ.66లక్షలతో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌, తిర్మలాయపల్లె గ్రామంలో మన ఊరు, మన బడి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచన మేరకు చివరి నిమిషంలో మదనాపురం నూతన మండలంగా ఆవిర్భవించిందని అన్నారు. మండల ఏర్పాటు అనంతరం అనేక ప్రభుత్వ కార్యాలయాలు రావడం జరిగిందన్నారు. వ్యవసాయ మార్కెట్‌కు నెలవారి ఆదాయం వచ్చే విధంగా కాంప్లెక్స్‌కు కేవలం 90 రోజుల్లో నిర్మించడం అభినందనీయమని అన్నారు. త్వరలో బహిరంగ వేలం ద్వారా షాపులను కేటాయిస్తామని తెలిపారు. అంతకు ముందు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో మార్కె ట్‌ చైర్మన్‌ బాలనారాయణ, జడ్పీటీసీలు కృష్ణయ్యయాదవ్‌, వామన్‌గౌడ్‌, ఎంపీపీలు జన్నుపద్మావతి, గుంతమౌనిక, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బిట్లియాదగిరి, సర్పంచ్‌ రాంనారాయణ, సింగిల్‌ విండో చైర్మన్లు వంశీధర్‌రెడ్డి, వాసుదేవారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు వాసురెడ్డి, అంజియా దవ్‌, కోట్ల తిరుపతయ్య, కురుమూర్తి, శివశంకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T05:36:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising