వేతనాల వెతలు..
ABN, First Publish Date - 2022-12-15T23:03:16+05:30
మిషన్‌భగీరథ పథకంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు.
- మిషన్ భగీరథలో అవుట్ సోర్సింగ్
ఉద్యోగులు, కార్మికుల ఇక్కట్లు
- నాలుగేళ్లుగా అరకొర వేతనాలతో అవస్థలు
- కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్
- నెలనెలా అందని జీతాలు
- ఏజెన్సీలు మారినప్పుడల్లా కొర్రీలతో తంటాలు
- పీఎఫ్ జమ చేయకుండా సతాయింపులు
- 11 డిమాండ్లతో అధికారులకు విన్నపం
మహబూబ్‌నగర్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మిషన్‌భగీరథ పథకంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. నాలుగేళ్లుగా వేతనాలు పెంచక పో వడం, ఐదారు నెలలుగా వేతనాలు లేకపోవడం, పీఎఫ్ సకాలంలో జమ చేయక పోవడంతో ఇక్కట్లు పడుతున్న పరిస్థితి నెలకొన్నది. ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై ఉద్యోగులు, కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవు తోంది. కనీసం జీవో నెం. 11 ప్రకారం వేతనాలిప్పించేందుకైనా అధి కారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో 2019 మార్చి నుంచి మిషన్ భగీరథ పథకంలో స్కిల్డ్, సెమీస్కిల్డ్ కింద కార్మికులు పనిచేస్తున్నారు. లైన్మెన్స్, ఆప రేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, హెల్పర్లుగా వీరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొత్తం 1600 మంది ఈ పద్ధతిలో అవుట్సోర్స్గా పనిచేస్తుంటే, వీరితో పాటు నారాయణపేట జిల్లాలో తాగునీరందిం చే సత్యసాయి పథకంలో పనిచేస్తున్న మరో 65 మందిని కూడా ఈ పథకంలోనే కలిపారు. వీరిలో ఆపరేటర్లకు రూ. 11,600, లైన్మెన్లు ఇతర ఉద్యోగులు, కార్మికులకు రూ. 10,500 చొప్పున వేతనాన్ని అప్పట్లో ఖరారు చేశారు. నాటి నుంచి ఇవే వేతనాలు చెల్లిస్తున్నారని, కొందరికి నామమాత్రంగా ఏడాదికి రూ. 100, రూ. 300 చొప్పున పెంచి చేతులు దులుపు కుంటున్నారేతప్ప జీవో నెం.107 ప్రకారం వేత నాలు పెంచడంలేదని వాపోతున్నారు. ప్రతీ యేట వేతనాల పెంపుదల కోసం ఆర్జీలివ్వడ మే తప్ప అధికారులు కనీసం పరిశీలించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతన చట్టం ప్రకారం రూ. 26 వేలు చెల్లించా లని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇచ్చే అరకొర వేత నాలు కూడా నెలనెలా ఇవ్వడంలేదని కార్మికులు వాపోతున్నారు. అవుట్సోర్స్ ఏజెన్సీ కాంట్రాక్టులు మారినప్పుడల్లా ఏదోరకమైన కొర్రీలు వేస్తూ వేతనాలు జాప్యం చేస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నా రని ఆరోపిస్తున్నారు. మూడు నాలుగు నెలల పాటు వేతనాలివ్వ కుండా ఆపుతున్నారని, దీంతో తమకు జీవనం ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు. వీటితో పాటు కార్మిక శాఖ నిబంధనల ప్రకారం ప్రతీ ఉద్యోగి, కార్మికుడికి కాంట్రాక్ట్ సంస్థ జమ చేయాల్సిన ప్రావిడెంట్ ఫండ్ షేర్ కూడా జమచేయడంలేదని, ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని కార్మికులు తెలిపారు. పథకంలో పనిచేసే లైన్మెన్లు, ఫిట్టర్ల వంటి వారికి వేతనాలే తప్ప ఇతర టీఏ సదుపాయాలు లేకపోవడంతో భారంగా మారింది. మరమ్మతులు వచ్చినప్పుడు సొంత వాహనాల్లో వెళ్లి మరమ్మతులు చేయాల్సి వస్తోందని, దీంతో పెట్రోల్ ఖర్చులకు సొంతంగానే భరిస్తున్నామని తెలిపారు. ఈ ఖర్చులు తమకు భారమేనని చెబుతున్నారు.
మిషన్‌భగీరథ పథకంలో ఔట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు వేతనాలు పెంచాలని, రెగ్యులర్‌గా నెలనెలా వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్ నిధులు జమ చేయాలనే డిమాండ్లతో ఇటీవల ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. సమ్మె చేస్తామని హెచ్చరించి, మహబూబ్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయం వద్ద ధర్నాకు దిగడంతో అధికారులు, ఏజన్సీ నిర్వాహకులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కార్మికులు, ఉద్యోగులు కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు పెంచి ఇవ్వాలని, నెలనెలా జాప్యం లేకుండా వేతనాలివ్వాలని, పీఎఫ్ నిధులు ఎప్పటికప్పుడు జమ చేయాలని, గుర్తింపు కార్డులు, హెల్త్‌కార్డుల పంపిణీ తదితర 11 డిమాండ్లను అధికారుల ఎదుట ఉంచారు. సమస్యలు పరిష్కరించనందుకు సమ్మె చేస్తున్నామని కార్మిక సంఘాల నాయకులు కురుమూర్తి, కిరణ్, నరసింహారెడ్డి తదితరులు పేర్కొన్నారు.
Updated Date - 2022-12-15T23:03:17+05:30 IST