ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధిత కుటుంబానికి ఎల్‌ఓసీ అందజేత

ABN, First Publish Date - 2022-01-21T05:49:22+05:30

మండల పరిధిలోని శేరుపల్లి గ్రామానికి చెందిన రామాజనేయులకు మెరుగైన చికిత్స కోసం సీఎం సహాయనిధి నుంచి రెండు లక్షల రూపాయలు మంజూరయ్యాయి.

బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌వోసీని అందిస్తున్న ఎమ్మెల్యే అబ్రహాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

    అలంపూర్‌ చౌరస్తా/గద్వాల క్రైం, జనవరి 20 : మండల పరిధిలోని శేరుపల్లి గ్రామానికి చెందిన రామాజనేయులకు మెరుగైన చికిత్స కోసం సీఎం సహాయనిధి నుంచి రెండు లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ మొత్తానికి సంబంధించిన ఎల్‌వోసీని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం గురువారం తన క్యాంపు కార్యాలయంలో బాధితుడి కుమారుడు నరేశ్‌ నాయుడుకు అందించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సెల్‌ అధ్యక్షుడు కృష్ణగౌడు, మణిరాజు తదితరులు పాల్గొన్నారు.


జిల్లా కేంద్రంలో...

    మెరుగైన వైద్యం కోసం పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన నగదుకు సంబంధించిన ఎల్‌వోసీలను బాధితులకు డీసీసీబీ డైరెక్టర్‌ ఎంఏ సుభాన్‌, ఎంపీపీ విజయ్‌ గురువారం అందించారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మల్దకల్‌ మండలంలోని నాగర్‌దొడ్డి గ్రామానికి చెందిన రంగస్వామిగౌడుకు రూ.15,000, గట్టు మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన కృష్ణన్నకు రూ.80,000 ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్‌వోసీలను బాధిత కుటుంబసభ్యులకు అందించారు. మల్దకల్‌ మండలంలోని విఠలాపురం గ్రామానికి చెందిన అర్జున్‌కు రూ. 24,000, కేటీదొడ్డి మండలంలోని బింగిదొడ్డికి చెందిన రజితకు రూ.39,000 లకు సంబంధించిన ఎల్‌సీవోసీలను బాధిత కుటుంబ సభ్యులకు ఇచ్చారు. కార్యక్రమంలో కేటీఆర్‌ యువసేన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్‌రెడ్డి, చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T05:49:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising