ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవునికి సేవ చేసినట్లే

ABN, First Publish Date - 2022-07-06T05:08:29+05:30

పిల్లలకు వైద్య సేవలు అందించడమంటే సాక్షాత్తు దేవునికి సేవ చేసినట్లేనని వనపర్తి మెడికల్‌ కళాశాల సూపరింటెండెంట్‌, పిడియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెడికల్‌ కళాశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌

ఇండియా టుడే దక్షిణాది టాప్‌ డాక్టర్స్‌ జాబితాలో చోటు సంపాదించుకున్న వైద్యుడు


వనపర్తి వైద్యవిభాగం, జూలై 5: పిల్లలకు వైద్య సేవలు అందించడమంటే సాక్షాత్తు దేవునికి సేవ చేసినట్లేనని వనపర్తి మెడికల్‌ కళాశాల సూపరింటెండెంట్‌, పిడియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ అన్నారు. ఇండియా టుడే దక్షిణాది టాప్‌ డాక్టర్స్‌ జాబితాలో చోటు సంపాదించుకున్న ఆయన మంగళవారం జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిలో గల తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. డాక్టర్‌ వృతి సమాజంలో ఎంతో గౌరవ ప్రదమైనది కావడంతో తాను వైద్య వృత్తిలోకి రావడం జరిగిందన్నారు. ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించాలన్నదే తన కోరికని చెప్పారు. తాను పిడియాట్రిషన్‌ కావడానికి చిన్నపిల్లలే కారణమన్నారు. మనసులో ఎలాంటి రాగద్వేషాలు, కుళ్లు, కుతంత్రాలు, కులం, మతం లేని వారే చిన్నారులని, అలాంటి వారికి వైద్య సేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పిల్లలకు వైద్యం అందించాలంటే ఎంతో ఓపిక అవసరమని,  వారి స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని, తల్లిదండ్రులను సంప్రదించి వైద్యం చేయాల్సి ఉంటుందన్నారు. తన 30 సంవత్సరాల వైద్య వృత్తిలో దాదాపు 30 వేల మంది వరకు చిన్నపిల్లలకు పలు రకాల సర్జరీలు చేశానని, ఇండియా టుడే దక్షిణాది టాప్‌ డాక్టర్స్‌ జాబితాలో చోటు దక్కడం సంతోషంగా ఉందని అన్నారు. మొదటి నుంచి తనకు సహకరిస్తూ, సపోర్ట్‌గా నిలిచిన తన కుటుంబ సభ్యులకు, తోటి డాక్టర్లకు, ప్రజలకు ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 


అభినందనలు

ఇండియా టుడే దక్షిణాది టాప్‌ డాక్టర్స్‌ జాబితాలో చోటు దక్కడంతో డాక్టర్‌ నరేంద్ర కుమార్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. జనరల్‌ ఆస్పత్రిలో మెడికల్‌ కళాశాల వైద్య బృందంతో పాటు జిల్లా జనరల్‌ ఆస్పత్రి వైద్య బృందం, ఆస్పత్రి స్టాఫ్‌ శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్‌ కట్‌ చేయించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రంగారావు, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సునందిని, వైస్‌ ప్రిన్సిపాల్‌, ఆస్పత్రి సుపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజ్‌కుమార్‌, డాక్టర్‌ హరీష్‌ సాగర్‌, రెడ్‌క్రాస్‌ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T05:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising