ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ABN, First Publish Date - 2022-12-06T23:21:41+05:30

కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మి ద్దామని ఆ శాఖ రాష్ట్ర జాయిం ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జాన్‌బాబు పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జాన్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూత్పూర్‌, డిసెంబరు 6: కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మి ద్దామని ఆ శాఖ రాష్ట్ర జాయిం ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జాన్‌బాబు పిలుపునిచ్చారు. మంగళవారం భూత్పూర్‌ మండల కేంద్రం లో ని మహిళా సమాఖ్య కేంద్రం లో ఆశకార్యక్తలకు, మహిళా సంఘాల మహిళలకు కుష్టు వ్యాధి నిర్మూలనపై ఆవగాహన క ల్పించారు. కుష్ఠు వ్యాధిని ప్రారం భదశలోనే గుర్తించినట్లైతే వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించొచ్చన్నారు. గ్రామాల్లో అనుమా నాస్పదంగా కనిపిస్తే వెంట నే మండల వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించా రు. ఈనెల 22వరకు సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. వ్యాధి అనేది ఏలా సోకుతుంది? నివా రణ చర్యలు ఏమిటి? అనే విషయాలను క్షుణ్ణంగా వివరించారు. జిల్లా వ్యాప్తంగా 858టీము లు, 760గ్రామాలు, 441 గ్రామ పంచాయతీలు, 1,91,080 ఇళ్లల్లో సర్వే చేయనున్నట్లు తెలి పారు. సమావేశంలో పీఆర్‌వో సంధ్యాకిరణ్మి, ఏపీఎంవోలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధికారులు జరినాభాను, హన్ముంతరావు, నర్సిహరెడ్డి, సీహెచ్‌వో రామయ్య, సూపర్‌వైజర్‌ యాదమ్మ, హెల్త్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising