ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుందాం

ABN, First Publish Date - 2022-08-13T05:15:14+05:30

ఎంతోమంది ప్రాణత్యాగాలతో స్వాతంత్య్రం వచ్చిందని వారిని స్మరించుకుందామని బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్‌ చావల్‌, కోశాధికారి సాయిలు అన్నారు.

బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్‌ చావల్‌

గద్వాల, ఆగస్టు 12: ఎంతోమంది ప్రాణత్యాగాలతో స్వాతంత్య్రం వచ్చిందని వారిని స్మరించుకుందామని బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్‌ చావల్‌, కోశాధికారి సాయిలు అన్నారు. శుక్రవారం బీజేపీ  ఆధ్వర్యంలో పట్టణంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు.  ర్యాలీ డీకే  బంగ్లా నుంచి  ప్రారంభమై పట్టణ పురవీధుల గండా కొత్తబస్టాండ్‌, అంబేడ్కర్‌ చౌరస్తా, రాజీవ్‌ మార్గ్‌, పాత బస్టాండ్‌, కూరగాయల మార్కెట్‌, క్రిష్టారెడ్డి బంగ్లా మీదుగా గాంధీ చౌక్‌కు చేరింది. అక్కడ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు రోహిత్‌ చావల్‌, సాయి లు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పండుగా  నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ 75ఏళ్లలో భారత్‌ ఎంతో ప్రగతిని సాధించిందని చెప్పారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత దేశ ప్రగతి, అభివృద్ధి, ప్రపంచ దేశాలతో భారత సంబంధాలతో దేశం కీర్తింపబడుతున్నదని వివరించారు.  కార్యక్రమంలో బీజేవైఎం కార్యకర్తలు, అన్ని మోర్చాలు ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, మునిసిపల్‌  మాజీ చైర్‌పర్సన్‌ అక్కల రమాసాయిబాబ, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట్రాములు, మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ రామాంజనేయులు, బీసీ మోర్చా అధ్యక్షుడు కబీర్దాస్‌ నర్సింహులు, ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగేందర్‌ యాదవ్‌, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జీఎల్‌ చందు, నాయకులు తుమ్మల నర్సింహులు, నెమలికంటి రామాంజనేయులు, కెఎం సత్యం, కొత్త గణేష్‌, ఎల్లప్ప, పేపర్‌ నర్సింహులు తదితరులున్నారు.

Updated Date - 2022-08-13T05:15:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising