ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యేను కలిసిన కిషన్‌గూడ నాయకులు

ABN, First Publish Date - 2022-07-02T05:43:23+05:30

మండలంలోని కిషన్‌గూడ గ్రామా నికి చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మాడెమోని నర్సింహులు ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని హైదరాబాద్‌లో ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవాబ్‌పేట, జూలై 1 : మండలంలోని కిషన్‌గూడ గ్రామా నికి చెందిన నాయకులు  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మాడెమోని నర్సింహులు ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని హైదరాబాద్‌లో ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. మార్కెట్‌ డైరెక్టర్‌గా చెన్నయ్యను నియమించినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ లక్ష్మయ్య, నవాబ్‌పేట సర్పంచ్‌ గోపాల్‌ గౌడ్‌, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌, కో-ఆప్షన్‌ మెంబర్‌ తాహెర్‌, ఆంజనేయులు, రాజు పాల్గొన్నారు.


మహిళల సమస్యలు పరిష్కరించాలి : ఐద్వా

పాలమూరు, జూలై 1 : సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకులు పరిష్కరించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ఉపాధ్యక్షు రాలు కందికొండ గీత డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యా లయంలో ఏర్పాటు చేసిన ఐద్వా పట్టణ కమిటీ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజర య్యారు. 4వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదోసారి ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో రేషన్‌ కార్డులు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, ఒంటరి మహిళ పింఛన్లు రాక నాలుగేళ్ల వుతోందన్నారు. నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వకపోవటంతో అవస్థలు పడుతు న్నారని తెలిపారు. సమావేశంలో అనురాధ, గౌసియ, లక్ష్మి, లక్ష్మీకళావతి, కృష్ణవేణి, అంజమ్మ, నాగమణి పాల్గొన్నారు. 


ప్లాస్టిక్‌ సంచులను వినియోగిస్తే జరిమానా 

జడ్చర్ల, జూలై 1 : సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిందని జడ్చర్ల మునిసి పల్‌ కమిషనర్‌ మహమూద్‌షేక్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 120 మైక్రాన్‌ సాంద్రత కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్‌ సంచులను వినియోగించే వారికి రూ.500 జరిమానా, విక్రయించిన వారికి రూ.5వేల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ఈ అంశంపై ప్రత్యేక బృందం తనిఖీలు నిర్వహి స్తుందని పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-02T05:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising