ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా లక్ష్మీ నరసింహ్మస్వామి రథోత్సవం

ABN, First Publish Date - 2022-05-18T04:45:25+05:30

మండల కేంద్రంలో వెలసిన లక్ష్మీ నరసింహ్మస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహిం చారు.

రథోత్సవంలో పాల్గొన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వేలాదిగా తరలివచ్చిన భక్తులు

మాగనూరు, మే 17  : మండల కేంద్రంలో వెలసిన లక్ష్మీ నరసింహ్మస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా భక్తులు గోవిందనామ సర్మణ మధ్య స్వామివారి రథాన్ని లాగారు. అంతకుముందు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను దేవాలయం నుంచి పల్లకీలో మేళతాళాల మధ్య రథం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. రథోత్స వం అనంతరం ఉత్సవ విగ్రహాలను వాగుల హనుమాన్‌ ఆలయం వద్దకు మేళతాళాల మధ్య తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పాల ఉట్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించగా  మండల ప్రజలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కార్య క్రమంలో సర్పంచు రాజు, ఎంపీపీ శ్యామలమ్మ, మాజీ జడ్పీటీసీ సరిత, మధుసూదన్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు జైపాల్‌రెడ్డి, ఈశ్వరయ్య, సత్యప్ప, వాకిటి శ్రీనివాసులు, కె.కృష్ణయ్య, అంజప్ప, పురుషోత్తంరెడ్డి, బాబుగౌడ్‌, మధుసూదన్‌రెడ్డి, మక్తల్‌ మాజీ జడ్పీటీసీ శ్రీహారి, గణేష్‌, తాయప్ప, మాజీ సర్పంచు ఆనంద్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T04:45:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising