ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మిక శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడాలి

ABN, First Publish Date - 2022-01-18T04:30:06+05:30

కార్మిక శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల కార్మికులకు వచ్చే బెనిఫిట్స్‌ అమలు కావడం లేదని ఇప్ట్యూ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌ పేర్కొన్నారు.

ఇప్ట్యూ జిల్లా మహాసభలో మాట్లాడుతున్న అన్వేష్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట టౌన్‌, జనవరి 17 : కార్మిక శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల కార్మికులకు వచ్చే బెనిఫిట్స్‌ అమలు కావడం లేదని ఇప్ట్యూ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌ పేర్కొన్నారు. వెంటనే కార్మిక శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడాలన్నారు. జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్‌ భవన్‌లో తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం (ఇప్ట్యూ) జిల్లా కార్యదర్శి నరసింహులు అధ్యక్షతన జిల్లా మొదటి మహాసభ సోమ వారం కొనసాగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌ పాల్గొని మాట్లాడారు. 1996లో నిర్మాణ చట్టం వచ్చిందని, అనేక ఉద్యమాల ఫలితంగా 2009లో అమల్లోకి వచ్చిందన్నారు. రాష్ట్ర కార్యదర్శి సాంబశివుడు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు డెలివరీ, డెత్‌, మ్యారేజి గిప్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఇంత వరకు అట్టి డబ్బులు రావడం లేదన్నారు. వెంటనే అధికారులు డబ్బులు అందించాలన్నారు. సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి రాము, సలీం, పీవైఎల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాశీనాథ్‌, ఇప్ట్యూ కిరణ్‌ మాట్లాడారు. కార్యక్రమంలో ఇప్ట్యూ నరసింహ, రామాంజనేయులు, వెంకటయ్య, చెన్నప్ప, బాలు, సాయిలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T04:30:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising