ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొల్లాపూర్‌ శాశ్వత అభివృద్ధే లక్ష్యం

ABN, First Publish Date - 2022-08-31T05:38:55+05:30

కొల్లాపూర్‌ నియోజకవర్గాన్ని శాశ్వత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌ రెడ్డి 

కొల్లాపూర్‌ రూరల్‌, ఆగస్టు 30: కొల్లాపూర్‌ నియోజకవర్గాన్ని శాశ్వత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌ రెడ్డి అన్నారు.  పట్టణంలో 20ఏళ్లగా పెండింగ్‌లో ఉన్న హిందూ శ్మశానవాటిక సమస్య పరిష్కారం కావడంతో కాలనీవాసులు, రిటైర్డు ఉద్యోగ సంఘం నాయకులు, ఆదర్శ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మునిసిపాలిటీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. అనం తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో శ్మశానవాటికల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు.  సోమశిల సిద్ధేశ్వరం వంతెన నిర్మాణంతో కొల్లాపూర్‌ రూపురేఖలు మారనున్నాయన్నారు.  కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ మహిముదాబేగం, టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు,  రైతు సంఘం నాయకులు, అధికారులు ఉన్నారు. 

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఆసరా పింఛన్‌ 

పెంట్లవెల్లి: అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తామని ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మల్లేశ్వరం, జటప్రోలు, ఎంగంపల్లి తండా,  మంచాలకట్ట గ్రామాల్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే  పింఛన్‌ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మల్లేశ్వరంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెంట్లవెల్లి, మల్లేశ్వరం గ్రామాల మధ్య బ్రిడ్జి లేక నిత్యం ప్రజలు ఇబ్బందులు పడేవారని, బ్రిడ్జి నిర్మాణంతో ఆ కష్టాలు  తొలగిపోయాయని పేర్కొన్నారు. అదేవిధంగా మండల కేంద్రానికి అంబులెన్స్‌ సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పేదల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో  మల్లేశ్వరం సర్పంచు తిరుపాటి నాగ రాజు, ఎంపీపీ ఉమామహేశ్వరి, జడ్పీటీసీ సభ్యురాలు చిట్టెమ్మ, ఎంపీటీసీ సభ్యు రాలు ఈశ్వరికుమారి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోతుల వెంకటేశ్వర్లు, టీఆర్‌ ఎస్‌ నాయకులు రాజేష్‌, సురేందర్‌గౌడ్‌, అబ్దుల్‌ హుస్సేన్‌, రఫీయోద్దిన్‌,  నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.   

Updated Date - 2022-08-31T05:38:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising