ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ అసమర్థ పాలన

ABN, First Publish Date - 2022-08-15T04:57:29+05:30

కేసీఆర్‌ అసమర్థ పాలన కారణంగా రాష్ట్ర ఖాజనా ఖాళీ అయ్యిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షరాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

మద్దూరులో విద్యార్థినులతో మాట్లాడుతున్న షర్మిల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల


మద్దూర్‌, ఆగస్టు 14: కేసీఆర్‌ అసమర్థ పాలన కారణంగా రాష్ట్ర ఖాజనా ఖాళీ అయ్యిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షరాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. నారాయణపేట జిల్లా మద్దూర్‌ మండలంలో ఆదివారం చేపట్టిన పాదయాత్రలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. యువతకు నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, రుణమాణీ, మూడెకరాల భూమి భూ పంపిణీ అమలు చేయాలేదన్నారు. బంగారు తెలంగాణ కేసీఆర్‌ కుటుంబానికి, ఆయన పనులు అప్పగించిన కాంట్రాక్టర్లకేనని అన్నారు. వైఎస్‌ఆర్‌ హయాంలో తెచ్చిన రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. కేసీఆర్‌ నిరంకుశ పాలనను కాంగ్రెస్‌, బీజేపీ ప్రశ్నించడం లేదన్నారు. వైఎస్‌ఆర్‌ టీపీ అధికారంలోకి వస్తే ప్రతీ ఇంట్లో అర్హులైన వారికి పింఛన్‌, ఇంటికో ఉద్యోగం, రైతులకు రుణమాఫి వర్తింపజేస్తామన్నారు. షర్మిల పాదయాత్రకు మద్దూర్‌లో అపూర్వ స్పందన లభించింది. జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు.


అప్పుల తెలంగాణ

దామరగిద్ద: కేసీఆర్‌ పాలనలో తెలంగాణ బంగారు తెలంగాణ కాదని, అప్పుల తెలంగాణగా మారిందని వైఎస్‌ఆర్‌ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన పాదయాత్ర ఆదివారం మద్దూరుకు చేరుకుంది. క్యాతన్‌పల్లి, బాపన్‌పల్లి గ్రామాల్లో ఆమె మాట్లాడారు. వైఎస్‌ఆర్‌ ఐదేళ్లు సీఎంగా ఉండి, ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. కేసీఆర్‌కు రెండుసార్లు అవకాశం ఇస్తే చేసిందని శూన్యమన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు అమ్ముడు పోయాయన్నారు. కేసీఆర్‌ను ప్రశ్నించేందుకే పార్టీని స్థాపించామన్నారు. వృద్ధులు, కూలీలు, జీపులు, ఆటోల్లోని ప్రయాణికులు, రైతులతో ఆమె మాట్లాడారు. బాపన్‌పల్లి నుంచి దామరగిద్ద వరకు వర్షం కురుస్తున్నా పాదయాత్రను కొనసాగించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-15T04:57:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising