ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి

ABN, First Publish Date - 2022-08-11T05:10:25+05:30

బాలల రక్షణ కోసం ఏర్పాటైన చట్టాలను సంరక్షిస్తూ, వాటిని పటిష్ఠంగా అమలు చేసేందుకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పని చేయా లని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సంబంధిత శాఖల అధికారుల శిక్షణలో ఎస్పీ వెంకటేశ్వర్లు

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 10 : బాలల రక్షణ కోసం ఏర్పాటైన చట్టాలను సంరక్షిస్తూ, వాటిని పటిష్ఠంగా అమలు చేసేందుకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పని చేయా లని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. బాలల సంరక్షణ భద్రత చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి బుధవారం జిల్లా పోలీసు కార్యాల యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాలబాలికలపై జరుగుతున్న హింస, నేరాలు, మానవ అక్రమ రవాణాపై పెద్దఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అధికారి సంధ్యారాణి, జిల్లా సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం మాట్లాడుతూ బాలలపై జరిగే నేరాలలో నింది తులకు త్వరగా శిక్షపడేలా చేయాలని,  దాని వల్ల నేరాలు చేయాలంటే మిగతావారు భయ పడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రాములు, చైల్డ్‌ వెల్పేర్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ నయీమొద్దీన్‌, రిసోర్స్‌ పర్సన్‌ డేవిడ్‌రాజ్‌, డీఎస్పీలు మహేశ్‌, రమణారెడ్డి, మధు, ఆదినారాయణ, కో-ఆర్డినేటర్‌ వెంకటమ్మ, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి నర్మద పాల్గొన్నారు. 

ఫ వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అదనపు ఎస్పీ ఏ రాములు, డీఎస్పీలు మహేశ్‌, మధు, ఆదినారాయణ, రమణారెడ్డి, సీఐ రాజేశ్వర్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T05:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising