ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kollapur: కొల్లాపూర్‌లో వేడెక్కిన రాజకీయం.. జూపల్లి వర్సెస్ బీరం.. అసలు గొడవేంటంటే..

ABN, First Publish Date - 2022-06-26T20:14:01+05:30

తాను చేసిన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్ (Nagar Kurnool)‌: తాను చేసిన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli KrishnaRao) స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి (Harshavardhan Reddy)పై చేసిన ఆరోపణలు నిరూపిస్తానన్నారు. తాను ఏ బ్యాంక్‌ రుణం ఎగ్గొట్టలేదన్నారు. తన ప్రతిష్ట దిగజార్చాలనే హర్షవర్ధన్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్‌ఐసీ లోన్‌ క్లియర్‌ చేసినట్లు తన దగ్గర లేఖ ఉందన్నారు. రూ.6 కోట్లు లోన్‌ తీసుకున్న మాట వాస్తవమేనని, అప్పు కట్టడం ఆలస్యమైతే రూ.14 కోట్లకు సెటిల్‌ చేసుకున్నానని తెలిపారు. తనపై అన్యాయంగా ఏసీబీ కేసు పెట్టారని, అప్పు మాత్రమే చేశానని..తప్పు చేయలేదని జూపల్లి స్పష్టం చేశారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పునరావాసం పూర్తికాలేదని, నిర్వాసితులకు ఇంకా పరిహారం కూడా అందలేదన్నారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారికి మాత్రమే హర్షవర్ధన్‌రెడ్డి మేలు చేశారని జూపల్లి ఆరోపించారు.


తన చరిత్ర గురుంచి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డికి లేదని, తనపై చేసిన ఆరోపణలకు పేపర్లతో సహా చర్చకు సిద్ధమని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కానీ ఎమ్మెల్యే పోలీసులను అడ్డుపెట్టుకొని అరెస్ట్ పేరుతో పారిపోయారని ఎద్దేవా చేశారు. అబివృద్దిపై చర్చ కాకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోనని, పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని వదులుకొని ఉద్యమంలో పాల్గొన్నానని జూపల్లి కృష్ణారావు అన్నారు.


కాగా కొల్లాపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. బహిరంగ చర్చకు బయల్దేరిన ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే అనుచరుల ఆందోళనకు దిగారు. జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డిల మధ్య వర్గపోరు నడుస్తోంది. పరస్పరం ఇరువురు నేతలు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఇరువురి నేతలు సవాళ్లు.. ప్రతి సవాళ్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జూపల్లి, హర్షవర్ధన్‌ ఇళ్ల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు జూపల్లి ఇంటి దగ్గర హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకుంటున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు.

Updated Date - 2022-06-26T20:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising