ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలి
ABN, First Publish Date - 2022-12-07T22:56:06+05:30
యువతీ యువ కులు ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సూచించారు.
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
- ముగిసిన ఉచిత శిక్షణా తరగతులు
గద్వాల టౌన్, డిసెంబరు 7 : యువతీ యువ కులు ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సూచించారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులకు సిద్ధ మవుతున్న అభ్యర్థులకు అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్ స్టేడియంలో నిర్వహిం చిన ఉచిత శిక్షణ తరగతులు బుధవారం ముగి శాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావే శానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై అభ్యర్థులకు టీషర్ట్‌లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు 170 మందిలో 70 మందికి పైగా ఎస్‌ఐ పరీక్షలకు అర్హత సాధించడం అభినందనీయమన్నారు. ఈవెంట్స్‌లోనూ ప్రతిభను చాటి ఉద్యోగాలు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణ, ఇన్‌చార్జి డీవైఎస్‌వో ఎంపీ రమేష్‌బాబు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం గౌరవ అధ్యక్షుడు బీఎస్ ఆనంద్, అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యుడు సతీష్, కేటీఆర్ యువసేన ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్‌రెడ్డి, సాయిశ్యాంరెడ్డి, అన్వర్, ఎల్లప్ప పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కులు అందజేత
గద్వాల క్రైం : సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులు, ఎల్‌వోసీలను లబ్ధిదారులకు బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అందించారు. ధరూర్ మండల పరిధిలోని నర్పందొడ్డి గ్రామానికి చెందిన మాధవికి రూ.40,000, నాగేశ్వరికి రూ. 16,000 మెరుగైన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన అందించారు. అలాగే గట్టు మండల పరిధిలోని తారాపురం గ్రామానికి చెందిన వీరమ్మకు మంజూరైన రూ.14,000 విలు వైన చెక్కును ఇచ్చారు. కార్యక్రమంలో గట్టు ఎంపీపీ విజయ్, రాజారెడ్డి, సర్పంచ్ నల్లన్నగౌడు, ధరూర్ ఎంపీపీ రాజారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు విజయ్, తెరాస నాయకులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
కేటీదొడ్డి : మండలంలోని ఇర్కిచేడుకు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు జంగిలప్ప సోదరుడు బోయ ఆంజనేయులు మంగళవారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బుధవారం గ్రామానికి వెళ్లి ఆంజ నేయులు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట గట్టు ఎంపీపీ విజయ్‌కుమార్, కేటీ దొడ్డి మండల అధ్యక్షుడు ఉరుకుందు, రైతుబంధు సమితి అధ్యక్షుడు హనుమంతు, నాయకులు ప్రతాప్‌రెడ్డి, యుగంధర్‌గౌడ్, శ్రీధర్, భగవంంతు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T22:56:07+05:30 IST