ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జన గళమున జనగణమన

ABN, First Publish Date - 2022-08-17T04:38:13+05:30

జాతీయ భావన ఉప్పొంగింది.. దేశభక్తి ఉవ్వెత్తున ఎగిసింది. జాతీయ గీతం జిల్లా వ్యాప్తం గా మారుమోగింది.

శాంతినగర్‌లో జాతీయ గీతాలాపనలో పాల్గొన్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఏకకాలంలో వేలాది మంది జాతీయ గీతాలాపన

- పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు

- పాల్గొన్న జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ తదితరులు

గద్వాల టౌన్‌/ వడ్డేపల్లి/ ఎర్రవల్లి చౌరస్తా, ఆగస్టు 16 : జాతీయ భావన ఉప్పొంగింది.. దేశభక్తి ఉవ్వెత్తున ఎగిసింది. జాతీయ గీతం జిల్లా వ్యాప్తం గా మారుమోగింది. భారత స్వాతంత్య్ర వజ్రోత్స వాలను పురస్కరించుకుని మంగళవారం జిల్లా వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన ఉత్సాహంగా కొనసాగింది. శాంతినగర్‌లో నిర్వహిం చిన జాతీయ గీతాలాపనలో జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, ఎస్‌ఐ శ్రీనివాసులు, జడ్పీటీసీ సభ్యుడు రాజు, ఎంపీపీ రజితరాజు, ముని సిపల్‌ చైర్‌పర్సన్‌ సుజాత రామకృష్ణారెడ్డి, నాయకు లు పల్లయ్య, నాగరాజు పాల్గొన్నారు. గద్వాల పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ నేతృత్వంలో స్థానిక పాతబస్టాండ్‌ సర్కిల్‌లో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీహర్ష, అడిషనల్‌ ఎస్పీ రాములు నాయక్‌, మునిసిపల్‌ కమిషనర్‌ జానకీరామ్‌సాగర్‌, వైస్‌ చైర్మన్‌ బాబర్‌, కౌన్సిలర్లు పాల్గొని, త్రివర్ణ పతాకా నికి గౌరవందనం సమర్పించారు. వివిధ పాఠశాలల నుంచి జాతీయ జెండాలతో ర్యాలీగా వచ్చిన విద్యా ర్థులు వందేమాతరం... భారత్‌మాతాకీ జై అంటూ చేసిన నినాదాలు పట్టణంలో మారుమోగాయి. ఉద యం 11.30 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమా నికి వివిధ పాఠశాలల చిన్నారులు త్రివర్ణ పతాకాన్ని ప్రతిబింబించేలా వస్త్రధారణ, జాతీయ నాయకుల వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పట్టణం లోని గాంధీచౌక్‌, కృష్ణారెడ్డి బంగ్లా సర్కిల్‌, కృష్ణవేణి చౌక్‌, ఇతర ప్రధాన కూడళ్ల వద్ద నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రజలు, దుకాణాల యజమానులు పాల్గొన్నారు. ఎర్రవల్లి చౌరస్తాలో నిర్వహించిన జాతీయ గీతాలాపన కార్యక్ర మానికి అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ బండారి భాస్కర్‌, అలంపూర్‌ సీఐ సూర్యనాయక్‌, ఎంపీపీ స్నేహ, జడ్పీటీసీ సభ్యుడు హనుమంతురెడ్డి, పీఎసీఎస్‌ అధ్యక్షుడు రంగారెడ్డి, ఎర్రవల్లి సర్పంచ్‌ రవి, ఎస్‌ఐ గోకారి, ఎంఈవో రాజు పాల్గొన్నారు.





Updated Date - 2022-08-17T04:38:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising