ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తులకు మెరుగైన సేవలు అందించాలి

ABN, First Publish Date - 2022-05-21T05:01:16+05:30

జములమ్మ దేవత దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ నూతన పాలకవ ర్గానికి సూచించారు.

ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆలయ పాలకవర్గ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- గద్వాల మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ 

- ఘనంగా జములమ్మ ఆలయ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

గద్వాల, మే 20 : జములమ్మ దేవత దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ నూతన పాలకవర్గానికి సూచించారు. శుక్రవారం నిర్వహించిన జములమ్మ ఆలయ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్దికి నూతన పాలకవర్గం కృషి చేయాలని చెప్పారు. ఆల యంలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తే ఆయన ఎండోమెంటు అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వివరిం చారు. అంతకు ముందు ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎండోమెంటు ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరమ్మ 12 మంది పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిం చారు. కాగా పాలకవర్గ ప్రమాణ స్వీకారం అధి కారిక కార్యక్రమం అయినప్పటికి పత్రికలకు సమా చారం ఇవ్వకపోవడంతో పాటు సభ్యుల వివరాలను కూడా ముందుగా ప్రకటించకపోవడం కొసమెరుపు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ, పీఏసీయస్‌ చైర్మన్‌ సుభాన్‌, ఎంపీపీ ప్రతాప్‌ గౌడ్‌, రైతుబంధు అధ్యక్షుడు చెన్నయ్య, కౌన్సిలర్లు మురళి, నాగిరెడ్డి, నరహరి గౌడ్‌, నాగులు యాదవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T05:01:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising