ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యసేవల్లో లోటు రాకుండా చూసుకోవాలి

ABN, First Publish Date - 2022-08-20T05:34:36+05:30

జనరల్‌ ఆసుపత్రికి ఎ క్కువగా పేదవాళ్లే వస్తుంటా రని, వారికి అందించే వైద్య సేవల్లో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవలసిన బాధ్యత డాక్టర్లదేనని ఇన్‌చార్జి కలెక్టర్‌ తేజస్‌ నంద లాల్‌పవార్‌ అన్నారు.

రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్‌, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఇన్‌చార్జి కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవార్‌


మహబూబ్‌నగర్‌(వైద్య విభాగం)/కలెక్టరేట్‌, ఆగస్టు 19: జనరల్‌ ఆసుపత్రికి ఎ క్కువగా పేదవాళ్లే వస్తుంటా రని, వారికి అందించే వైద్య సేవల్లో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవలసిన బాధ్యత డాక్టర్లదేనని ఇన్‌చార్జి కలెక్టర్‌ తేజస్‌ నంద లాల్‌పవార్‌ అన్నారు. వజ్రోత్సవ వేడుకలను పురస్క రించుకొని శుక్రవారం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేప ట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ యన పలు వార్డులలో తిరుగుతూ రోగులతో మా ట్లాడారు. వారికి అందుతున్న సేవలు, ఆహారంపై ఆరా తీశారు. ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్‌ డా.రమేష్‌, జనరల్‌ ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరిం టెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌లతో కలిసి ఇన్‌చార్జి కలెక్టర్‌ రోగులకు పండ్లు, స్వీట్లు, బ్రెడ్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ సూప రింటెండెంట్‌ డా.జీవన్‌, ఆర్‌ఎంవోలు డా.సిరాజుద్దీన్‌, వంశీకృష్ణ, డా.శ్వేత, డా.ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా, జిల్లా కేం ద్రంలోని బాలసదనంలో పిల్లలకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. ఏనుగొండ శాంతివనం, అనాథ శరణాలయంలోని అనాధ పిల్లలకు కూడా పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తన ఛాంబర్‌లో ఫొటోగ్రాఫర్లు, ప్రెస్‌ ఫొటో గ్రాఫర్లతో కలిసి కేకును కట్‌ చేసి ఫొటోగ్రాఫర్లకు శుభా కాంక్షలు తెలిపారు.  కార్యక్రమంలో జర్నలి స్టులు గోవర్థన్‌గౌడ్‌, భాస్కరాచారి, రవికుమార్‌, కిరణ్‌, వెంకటరమణ, చంద్రశేఖర్‌గౌడ్‌, రాజు, మధు, రాజశేఖర్‌, సంతోష్‌, మధు తదితరులున్నారు.

 రక్తహీనతతో బాధపడుతున్న వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

మహబూబ్‌నగర్‌ టౌన్‌ : రక్తహీనతతో బాధ పడుతున్న మహిళలు, బరువు తక్కువ ఉన్న పిల్ల లపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని ఇన్‌చార్జి కలె క్టర్‌ వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమశాఖ అధి కారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వైద్యా ధికారులు, సీడీపీవోలు, అంగన్‌వాడీ, ఆశ, ఏఎన్‌ ఎంలతో బరువు తక్కువ ఉన్న పిల్లలు, మహిళలు, యాంటీ నాటల్‌ చెక్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. 

ఖైదీలు సత్ప్రవర్తనతో బయటకు వెళ్లాలి

మహబూబ్‌నగర్‌ : ఆవేశంలో తప్పులు చేసి జైలుకు వచ్చిన వారు పూర్తిగా పరివర్తనం చెంది మారిన మనషుల్లా బయటకు వచ్చి సమాజంలో అందరితో సమానంగా సుఖమయ జీవితాన్ని గడ పాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌ అన్నారు. శుక్రవారం ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లుతో కలిసి జిల్లా జైలును సందర్శించారు. ఖైదీలతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పం డ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. జైలు సూపరింటెం డెంట్‌ వెంకటేశ్‌, జైలర్‌ శ్రీనివాసులు ఉన్నారు. 

Updated Date - 2022-08-20T05:34:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising