ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2022-12-16T23:01:39+05:30

పౌరులకు అందించే నిత్యావసర సేవల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ పద్మజారెడ్డి హెచ్చరించారు.

పెట్రోల్‌ బంకును తనిఖీ చేస్తున్న అదనపు కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అదనపు కలెక్టర్‌ పద్మజారాణి

- పెట్రోల్‌ బంకు, రేషన్‌ షాపులు తనిఖీ

మరికల్‌, డిసెంబరు 16: పౌరులకు అందించే నిత్యావసర సేవల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ పద్మజారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మండల పరిధిలోని పెట్రో ల్‌ బంకు, రేషన్‌ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడు తూ మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంకుల్లో నోస్టాక్‌ బోర్డు పెట్టి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించడంపై పెట్రోల్‌బంకు యాజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోస్టాక్‌ బోర్డు పెట్టకుండా పెట్రోల్‌, డీజిల్‌ నిరంతరంగా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనదారులకు ఇబ్బం దులు కలిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం మం డలంలోని రేషన్‌ షాపులను తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా రేషన్‌షాపులోని రికార్డులను పరిశీలించగా, ఒ కటవ నంబరు రేషన్‌ షాపులో 8.50క్వింటాళ్ల రేషన్‌ బియ్యం అఽధికంగా ఉన్నట్లు గర్తించారు. ఈ విషయం పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మండల పౌరసరఫరాల శాఖ తనిఖీ అధికారి కాలప్ప ను ఆదేశించారు. ఒకటవ షాపు యాజమాని పోగాకు మల్లేష్‌ అక్టోబరు 6న మరణించడంతో, రెండవ షాపు యాజమాని మంజులదేవికి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించామన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీశెలం, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బెలగుంది వీరన్న, హరీశ్‌కుమార్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:01:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising