ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్యూటీ డాక్టర్ల సమాచారం సూచిక బోర్డులో ఉంచాలి

ABN, First Publish Date - 2022-05-18T05:20:32+05:30

ప్ర భుత్వ ఆసుపత్రిలో పని చేసే డ్యూటీ డాక్టర్ల పే ర్లు, ఫోన్‌ నెంబరు ఏరోజుకు ఆరోజు బయట సూచిక బోర్డుపై కనపడే విధంగా పెట్టాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, మే 17 (ఆంధ్రజ్యోతి) : ప్ర భుత్వ ఆసుపత్రిలో పని చేసే డ్యూటీ డాక్టర్ల పే ర్లు, ఫోన్‌ నెంబరు ఏరోజుకు ఆరోజు బయట సూచిక బోర్డుపై కనపడే విధంగా పెట్టాలని   కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ ఆదేశించారు. మంగ ళవారం ఉదయం కలెక్టర్‌ చాంబర్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల పనితీరుపై సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ ఏ ఆస్పత్రిలో ఏ సమయానికి ఏ డా క్టర్‌,  స్టాఫ్‌నర్సు పని చేస్తారనే డ్యూటీ రోస్టర్‌ ప్రకారం సిబ్బంది వివరాలు కచ్చితంగా సూచిక బోర్డుపై పేషెంట్లకు కనపడేవిధంగా పెట్టాలని   వైద్యాధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఆసుపత్రి సిబ్బంది హాజరు తెలిపే బయో మె ట్రిక్‌ మిషన్లను అమర్చాలని, ప్రతీ నెల జీతం ఈ బయోమెట్రిక్‌ మిషన్‌ హాజరు నివేదికను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఆమోదంతోనే బిల్లు పాస్‌ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతీ పేషెంట్‌ ను ఆడ్మిట్‌ చేసుకొని బెడ్‌ ఇవ్వాలని వెంటనే చికిత్స ప్రారంభమయ్యే విధంగా చర్య లు తీసు కోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యపరంగా అన్ని చర్యలు తీసుకున్నప్పటికీని ఏదైనా జరగ రానిది జరిగితే అంతర్గత ఆడిట్‌ సమావేశం ని ర్వహించి ఎక్కడ పొరపాటు జరిగిందో నివేదిక రూపొందించాలని ఆదేశించారు. సమా వేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ సుధాకర్‌ లాల్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా క్టర్‌ రమాదేవి, డీసీహెచ్‌వో రమేష్‌, సూపరిం టెండెంట్‌  శివరాం, డాక్టర్‌ రఘు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T05:20:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising