ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరిగిన అత్యాచారాలు

ABN, First Publish Date - 2022-10-08T04:40:50+05:30

దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక స్త్రీలపై అత్యాచారాలు పెరిగాయని, మహిళల హక్కులు హరించబడుతున్నాయని, హక్కుల కోసం పోరాడుదామని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు రమ పిలుపు నిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ అధికారంలోకి వచ్చాక మహిళల హక్కుల హననం

పీవోడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు రమ

నేటి నుంచి నారాయణపేటలో పీఓడబ్ల్యూ రాష్ట్ర మహాసభలు 


నారాయణపేట టౌన్‌, అక్టోబరు 7: దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక స్త్రీలపై అత్యాచారాలు పెరిగాయని, మహిళల హక్కులు హరించబడుతున్నాయని, హక్కుల కోసం పోరాడుదామని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు రమ పిలుపు నిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని భగత్‌ సింగ్‌ భవన్‌లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర 7వ మహా సభలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాలతో పాటు మహిళా సంక్షేమ పథకాలు అమలు కావడంలేదన్నారు. బడ్జెట్‌లో మహిళలకు కేటాయింపులు తగ్గిపోతున్నాయని, కేసీఆర్‌ కిట్లు అమలు కావడం లేదన్నారు. సమాజంలోని రుగ్మతలను విడనాడాలని పీఓడబ్ల్యూ పోరాటం చేస్తోందని,  అందులో భాగంగానే శనివారం నుంచి రెండ్రోజుల పాటు నారాయణపేట జరిగే రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. సమావేశంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మీ, జిల్లా ప్రధాన కార్యదర్శి సౌజన్య, ఉపాధ్యక్షురాలు లక్ష్మీ, సునీత, మంజుల పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T04:40:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising