ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడల ద్వారా మేధస్సును పెంచుకోవాలి

ABN, First Publish Date - 2022-08-20T04:35:46+05:30

క్రీడల ద్వారా మేధస్సును పెంపొందించుకోవాలని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వనపర్తి రూరల్‌, ఆగస్టు19: క్రీడల ద్వారా మేధస్సును పెంపొందించుకోవాలని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దగూడెంలో గ్రామ కార్యదర్శులకు, ఫీల్డ్‌ ఆఫీసర్లకు మండల స్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ క్రీడాపోటీలను ప్రారంభించి మాట్లాడారు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఒక  క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. ఈజీఎస్‌ పనులను పంచాయతీ కార్యదర్శులకు అప్పజెప్పడం వల్ల గ్రామ కార్యదర్శులకు పబ్లిక్‌ రిలేషన్‌ లేక కాస్త ఇబ్బంది పడ్డారన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్‌ ఆఫీసర్‌ను విధుల్లోకి తీసుకోవడం వల్ల కార్యదర్శులకు భారం తగ్గిందన్నారు. కార్యదర్శులు ఫీల్డ్‌ ఆఫీసర్లు కలవడంతో మరింత ఆసక్తి పెరిగిందన్నారు. ఈజీఎస్‌ ద్వారా 95 రకాల పనులు చేసుకోవచ్చని, ఉపాధి పనుల ద్వారా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.  పది రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయని, గ్రామంలో మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసే విధంగా మీరు కృషి చేయాలని కోరారు. పెద్దగూడెం క్రీడా ప్రాం గణం మాదిరిగా మండలంలో ఏ గ్రామంలో లేదన్నారు.  కార్యక్రమంలో ఎంపీడీవో రపీస్‌ ఉన్నీసా బేగం, ఏపీవో సుకన్య, ఎంపీవో సుదర్శన్‌, గ్రామ సర్పంచ్‌ కొండన్న, నాయకులు గంధం నాగరాజు,  26 గ్రామాల కార్యదర్శులు, ఫీల్డ్‌ ఆఫీసర్‌లు , గ్రామస్థులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-20T04:35:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising