ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐకేపీ కేంద్రం సీజ్‌

ABN, First Publish Date - 2022-05-21T04:40:39+05:30

ధాన్యం కొనుగోలు కేంద్రం కాంటాల్లో తేడాలున్నాయని, తూకంలో తేడాలున్నాయనే ఫిర్యాదుతో మహమ్మదాబాద్‌ మండలం వెంకటరెడ్డిపల్లిలోని ఐకేపీ ధాన్యం కొను గోలు కేంద్రాన్ని తూనికలు, కొలతల శాఖ అధికా రులు తనిఖీలు నిర్వహించి, సీజ్‌ చేశారు.

వెంకట్‌రెడ్డిపల్లి వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో మాట్లాడుతున్న జిల్లా అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- తూకంలో తేడాలు

- ఆందోళన చేసిన రైతులు

- తక్షణం వేరే ఏజెన్సీ ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్‌

- ఇబ్బందుల్లేకుండా చూస్తామన్న డీఎస్‌వో  

- మహమ్మదాబాద్‌ మండలం వెంకటరెడ్డిపల్లిలో ఘటన


మహమ్మదాబాద్‌, మే 20: ధాన్యం కొనుగోలు కేంద్రం కాంటాల్లో తేడాలున్నాయని, తూకంలో తేడాలున్నాయనే ఫిర్యాదుతో మహమ్మదాబాద్‌ మండలం వెంకటరెడ్డిపల్లిలోని ఐకేపీ ధాన్యం కొను గోలు కేంద్రాన్ని తూనికలు, కొలతల శాఖ అధికా రులు తనిఖీలు నిర్వహించి, సీజ్‌ చేశారు. గ్రామా నికి చెందిన రైతు తిరుపతిరెడ్డి క్వింటాల్‌ ధాన్యా నికి రెండు కిలోలు తూకంలో తేడా వస్తుందని గు ర్తించి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గురువారం రైతు తిరుపతిరెడ్డి ఈ కేం ద్రానికి తన ధాన్యం తెచ్చి కాంటాలు వేయించడం తో పాటు, పక్కనే వేరే కాంటా ఏర్పాటుచేసి కొలత లు వేయగా క్వింటాల్‌కు రెండు కిలోల తరుగు వచ్చిందని గుర్తించారు. విషయాన్ని ఆయన జిల్లా తూనికలు, కొలతల అధికారికి ఫిర్యాదుచేయగా, వారు శుక్రవారం కేంద్రాన్ని సందర్శించి, కాంటాలు పరిశీలించి, తనిఖీలు నిర్వహించి మోసాన్ని నిర్థా రించారు. దీంతో కేంద్రంలోని కాంటాలను సీజ్‌ చే శారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు కేంద్రం వద్ద ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసు కున్న జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి వనజా తాదేవి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఏజెన్సీని మార్చి తక్షణం కొనుగోళ్లు ప్రారంభించా లని, ఇప్పటికే వర్షాలు, కొనుగోళ్ల జాప్యంతో చాలా నష్టపోయామని రైతులు డీఎస్‌వోని కోరారు. విష యాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఆమె హామీ ఇవ్వ డంతో రైతులు ఆందోళన విరమించారు. 

Updated Date - 2022-05-21T04:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising