ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ సవరణ బిల్లు పెడితే ప్రతిఘటించాలి

ABN, First Publish Date - 2022-08-08T04:46:36+05:30

కేంద్ర ప్రభుత్వం ‘విద్యుత్‌ సవరణ బిల్లు 2022’ను పార్లమెంట్‌లో ఆగస్టు 8వ తేదీన ప్రవేశపెట్టాలని నిర్ణయించటం దారుణమని విద్యుత్‌ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లా యీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ) మహబూబ్‌నగర్‌ జిల్లా కమిటీ వ్యతిరేకిం చింది.

మీడియాతో మాట్లాడుతున్న జేఏసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నేడు జిల్లా అంతటా మహాధర్నాకు జేఏసీ పిలుపు

పాలమూరు, ఆగస్టు 7 : కేంద్ర ప్రభుత్వం ‘విద్యుత్‌ సవరణ బిల్లు 2022’ను పార్లమెంట్‌లో ఆగస్టు 8వ తేదీన ప్రవేశపెట్టాలని నిర్ణయించటం దారుణమని విద్యుత్‌ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లా యీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ) మహబూబ్‌నగర్‌ జిల్లా కమిటీ వ్యతిరేకిం చింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో కన్వీనర్‌ డి.చంద్రమౌళి మాట్లాడారు. నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఎలక్ర్టీసిటీ ఎంప్లాయీస్‌ అండ్‌ ఇంజనీర్స్‌ (ఎన్‌సీసీవోఈఈఈ) విద్యుత్‌ సవరణ బిల్లును ప్రతిఘటించాలని పిలుపు నిచ్చిన విషయాన్ని వివ రించారు. జీవనాడిగా ఉన్న విద్యుత్‌ రంగాన్ని కేంద్రం దేశాన్ని కార్పొరేట్లకు అప్పగించాలని చూడటం దుర్మార్ఘమైందన్నారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే దేశంలో విద్యుత్‌రంగం పూర్తిస్థాయిలో ప్రైవేటీకరించబడుతుంద న్నారు. ఇంజ నీర్లకు, ఉద్యోగులకు, రైతులకు, వినియోగదారులకు తీవ్రవైన నష్టం వాటిల్లు తుందన్నారు. మానవాళి జీవన గమనాన్నే శాసిస్తున్న విద్యుత్‌ వనరులపై ప్రైవేట్‌ ఆధిపత్యం పెరిగే విధంగా విద్యుత్‌ బిల్లు తీసుకురావటమనేది సమాజానికి గొడ్డలిపెట్టులాంటిదన్నారు. ఆగస్టు 8వ తేదీన పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనుండ టంతో ఉమ్మడి జిల్లా అంతటా మహాధర్నా చేపడుతున్నట్లు వివరించారు. సమావేశంలో ఏడీలు, ఏఈలు, ఉద్యోగులు, కార్మికులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T04:46:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising