ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్‌ ధరలు పెంచుకుంటూపోతే బతికేదెలా?

ABN, First Publish Date - 2022-07-07T04:58:39+05:30

కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాల కోసం ఉపయోగించే ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు పెంచుకుంటూ పోతే సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతికేదెలా అని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి లక్ష్మి ప్రశ్నించారు.

రోడ్డుపై వంటావార్పుతో నిరసన తెలుపుతున్న ఐద్వా నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఐద్వా జిల్లా కార్యదర్శి లక్ష్మి

- రోడ్డుపై వంటావార్పుతో నిరసన 

వనపర్తి టౌన్‌, జూలై 6: కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాల కోసం ఉపయోగించే ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు పెంచుకుంటూ పోతే సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతికేదెలా అని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి లక్ష్మి ప్రశ్నించారు. పెంచిన వంటగ్యాస్‌ ధరను నిరసిస్తూ ఐద్వా సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రం లోని సాయినగర్‌ కాలనీలో రోడ్డుపై వంటావార్పు నిర్వహించి నిరసన వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలకు ప్రజల జీవనం అతలాకుతలం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌ సిలిండర్‌ను రూ. 1050 నుంచి 1150కు పెంచడంతో పేదలపై మోయలేని ఆర్థిక భారం పడుతోందన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేనియెడల మహిళలను ఏకం చేసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో ఐద్వా సంఘం నాయకులు రేణుక, కవిత, కాలనీ మహిళలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T04:58:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising