ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెల్త్‌ సబ్‌సెంటర్‌ పనులు పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-10-08T04:53:35+05:30

జిల్లాలో హెల్త్‌ సబ్‌ సెంటర్‌ పనులు, ‘మన ఊరు- మన బడి’ కింద చేపట్టిన పనులు అక్టోబరు చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి ఇంజనీరింగ్‌ అధికారులకు ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల క్రైం, అక్టోబరు 7 : జిల్లాలో హెల్త్‌ సబ్‌ సెంటర్‌ పనులు, ‘మన ఊరు- మన బడి’ కింద చేపట్టిన పనులు అక్టోబరు చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి ఇంజనీరింగ్‌ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌  సమావేశపు హాలులో పంచాయితీరాజ్‌, విద్యాశాఖ, వైద్యఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాలలో చేపట్టిన బస్తీ దవాఖానాలు(పీహెచ్‌సీ) పనులు ఎంతవరకు వచ్చాయని ఆరా తీశారు. అన్ని గ్రామాలలో పీహెచ్‌సీ పనులు ముమ్మరం చేసి  నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. కొన్ని గ్రామాలలో పీహెచ్‌సీల పనులు మంజూరైన మొదలు పెట్టలేదని, వాటికి టెండర్లు పిలిచి ఇతర కాంట్రాక్టర్ల ద్వారా పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. పల్లె దవాఖానాల పనులు పూర్తి చేసి కలరింగ్‌ పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. పనులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున పీహెచ్‌సి కేంద్రాలపై నీరు నిలువ ఉండకుండా మరమ్మతులు చేయించాలన్నారు. పాఠశాలల మరుగుదొడ్లు, డైనింగ్‌ హాల్‌, కాంపౌండ్‌ వాల్‌, కిచెన్‌ షెడ్‌లకు మంజూరైన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, ఈఈ సమత, డీఎంహెచ్‌వో చందూనాయక్‌, జిల్లా ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ నవీన్‌క్రాంతి, డీఈవో సిరాజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T04:53:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising