ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతో ఆరోగ్య పరిరక్షణ

ABN, First Publish Date - 2022-08-19T04:51:23+05:30

క్రీడలు దేహదారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి, ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా సూచించారు.

బహుమతులను ప్రదానం చేస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా 

- వజ్రోత్సవాల సందర్భంగా క్రీడా పోటీలు 


వనపర్తి అర్బన్‌, ఆగస్టు 18: క్రీడలు దేహదారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి, ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా సూచించారు. గురువారం ఐడీవోసీ సమావేశ మందిరంలో వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆమె బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల వల్ల వివిధ గ్రామాల క్రీడాకారుల మధ్య స్నేహభావం పెరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల్లో వివిధ విభాగాలలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని, ఫ్రీడం కప్‌ కార్యక్రమంలో 80మంది విజేతలుగా నిలిచినట్లు ఆమె తెలిపారు. జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో శారీరక దృఢత్వం ఏర్పడుతుందని, మెడిటేషన్‌, యోగా ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని అన్నారు. అనంతరం డీడబ్ల్యూవో పుష్పలత మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి రెహమాన్‌, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ అలివేలమ్మ, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

కొత్తకోట : వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం పట్టణంలోని ఉన్నత పాఠశాలలో ఉద్యోగులు, యువకులు, విద్యార్థులకు  ఫ్రీడం కప్‌ క్రీడా పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విజేతలకు బహుమతులు అందించారు. అంతకుముందు కొత్తకోట కమాన్‌ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం పరిషత్‌ కార్యాలయంలో మహిళా సంఘాలకు మంజూరైన రూ.8 కోట్ల 84 లక్షల 33వేల బ్యాంకు రుణాలతో పాటు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, రైతుబీమా చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే దివ్యాంగులకు ఆరోగ్య కిట్లను అందించారు. కార్యక్రమంలో  తహసీల్దార్‌ బాల్‌రెడ్డి ఎంపీడీవో శ్రీపాద్‌, ఏపీఎం శ్రీనివాసులుతో పాటు, వామన్‌గౌడ్‌, గుంతమౌనిక, శ్రీనివాసులు, విశ్వేశ్వర్‌, వంశీధర్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనువాసులు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు అల్లాబాష, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ యాదగిరియాదవ్‌ సర్పంచులు గాధంరాణి, లావణ్య, చంద్రకళ, శారద, రాధ, నాయకులు పాల్గొన్నారు.

వనపర్తి టౌన్‌ : వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో గురువారం మునిసిపల్‌ అధికారుల క్రికెట్‌ పోటీలను వనపర్తి మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ విక్రమసింహరెడ్డి, ఏఈ భాస్కర్‌, ఆర్‌వో అనిల్‌కుమార్‌, టీపీఎస్‌ సుధాకర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు. ఆ తర్వాత పట్టణంలోని 32వ వార్డు  కేడీఆర్‌ నగర్‌లోని బాలికల డిగ్రీ కళాశాల ఎదురుగా చేస్తున్న రామన్‌పాడ్‌ మంచినీటి పైప్‌లైన్‌ పనులను గట్టుయాదవ్‌ పరిశీలించి, అధికారులు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. కౌన్సిలర్‌ పెండెం నాగన్నయాదవ్‌, మునిసిపల్‌ ఏఈ భాస్కర్‌ వెంట ఉన్నారు.

పాన్‌గల్‌ : స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలను ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు మునీరుద్దిన్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సింగిరెడ్డి గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు హైమావతి, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, ఎంఈవో లక్ష్మణ్‌నాయక్‌, ఎంపీవో రఘురాం, హెచ్‌ఎం విష్ణువర్దన్‌రెడ్డి, పీడీలు సుధీర్‌రెడ్డి, వెంకటస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T04:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising