కోర్టు సముదాయానికి స్థలం కేటాయింపుపై హర్షం
ABN, First Publish Date - 2022-12-07T23:08:44+05:30
జిల్లా కోర్టు కాంప్లెక్స్ కోసం 10 ఎకరాల స్థలం కేటాయింపునకు ఎక్సైజ్‌శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్‌గౌడ్ కృషి చేసి నందునకు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చిత్రపటానికి న్యాయవాదుల క్షీరాభిషేకం
మహబూబ్‌నగర్, డిసెంబరు 7 : జిల్లా కోర్టు కాంప్లెక్స్ కోసం 10 ఎకరాల స్థలం కేటాయింపునకు ఎక్సైజ్‌శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్‌గౌడ్ కృషి చేసి నందునకు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి చిత్రపటానికి బుధ వారం కోర్టు ఆవరణలో న్యాయవాదులు క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా కోర్టు నిర్మాణానికి స్థలం సేకరించడానికి మంత్రి చేసిన కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జీపీ మనోహర్, ఫ్యామిలీకోర్టు పీపీ స్వదేశ్, న్యాయవాదులు ప్రతాప్‌కుమార్, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొనన్నారు.
న్యాయమూర్తికి జీవో కాపీ అందజేత
జిల్లా కోర్టు భవన సముదాయానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ కాపీని జిల్లా న్యాయమూర్తి ప్రేమావతికి న్యా యవాదులు అందజేశారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అనంతరెడ్డి, ఎస్ లక్ష్మారెడ్డి ఉపాధ్యక్షుడు అవేజ్, కార్యదర్శి ఎం కృష్ణ, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కెం జనార్దన్, సీనియర్ న్యాయవాది ప్రతాప్‌కుమార్, కార్యవర్గసభ్యులు, మీడియాసెల్ ఇన్చార్జి టి కృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:08:47+05:30 IST