ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా జాతీయ వైద్య దినోత్సవం

ABN, First Publish Date - 2022-07-02T05:13:41+05:30

జాతీయ వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నారాయ ణపేట జిల్లా ఆసుపత్రిలోని వైద్యులు కేక్‌ కట్‌ చేశా రు.

పేట జిల్లా ఆసుపత్రిలో కేక్‌ కట్‌ చేస్తున్న వైద్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట క్రైం, జూలై 1 : జాతీయ వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నారాయ ణపేట జిల్లా ఆసుపత్రిలోని వైద్యులు కేక్‌ కట్‌ చేశా రు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించి వైద్య సేవల పరంగా జిల్లా ఆసుపత్రిని నంబర్‌ వన్‌లో ఉంచేందుకు సిబ్బంది సమష్ఠిగా కృషి చేయాలని కోరారు. కరోనా సమయంలో ఫ్రంట్‌ లైన్‌ వారియ ర్స్‌గా ఉండి వైద్యులు ప్రజలకు సేవలు అందించ డం గర్వించదగ్గ విషయమన్నారు. అనంతరం రోగులకు కేక్‌, పండ్లు పంచారు. కార్యక్రమంలో వైద్యులు చక్రధర్‌, పావని, మునిషా, విక్రం, క్రాంతి, అక్షిత, ఆదిత్య, సరోజ పాల్గొన్నారు.

మక్తల్‌ : జాతీయ వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మక్తల్‌ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అథితి గృహంలో వైద్యులు రామకృష్ణారెడ్డి, విజయ్‌ కుమార్‌, ప్రాణేష్‌, అనిల్‌కుమార్‌, రాము, ప్రహ్లాద్‌, శ్రీరామ్‌లను శాలువా, పూలమాలతో ఘనంగా స త్కరించారు. ఈ సందర్భంగా నర్సింగ్‌హోమ్‌ వర్క ర్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు బాబుమియా మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్యం చేసిన దేవుళ్లు వైద్యులు అన్నారు. రాకేష్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు. 

నారాయణపేట : జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం నారాయణపేట నివాసి ఆ యుర్వేద వైద్యులు క్యాతన్‌ రఘునాథ్‌ను పద్మశాలి సంఘం, మాజీ పుర వైస్‌చైర్మన్‌ నందు నామాజీ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. పద్మశాలి సంఘం నాయకులు తాటి నర్సప్ప, లక్ష్మణ్‌, నర్సిములు,  దేవి వరప్రసాద్‌, సత్యనారాయణ ఉన్నారు. అదే విధంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు వైద్యుల దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ కంటి వైద్యులు, ఐఎంఏ ప్రెసిడెంట్‌ మల్లికార్జున్‌ను డీఎంహెచ్‌వో రాం మనోహర్‌రావు సన్మానించారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు పాల్గొన్నారు.




Updated Date - 2022-07-02T05:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising