మహా మేధావి శ్రీనివాస రామానుజన్
ABN, First Publish Date - 2022-12-22T23:00:27+05:30
గణిత మహా మేధావి శ్రీనివాస రామానుజన్ అని, మానవ మనుగడకు ఆయన చేసిన సేవలు అమోఘమని జిల్లా విద్యా ధికారి సిరాజుద్దీన్ అన్నారు.
- జిల్లా విద్యాధికారి సిరాజుద్దీన్
- జిల్లా వ్యాప్తంగా గణిత దినోత్సవం
- శ్రీనివాస రామానుజన్‌కు ఘన నివాళి
మల్దకల్/ కేటీదొడ్డి, డిసెంబరు 22 : గణిత మహా మేధావి శ్రీనివాస రామానుజన్ అని, మానవ మనుగడకు ఆయన చేసిన సేవలు అమోఘమని జిల్లా విద్యా ధికారి సిరాజుద్దీన్ అన్నారు. శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. మల్దకల్ మండలంలోని పాల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రామాను జన్ చిత్రపటానికి డీఈవో సిరాజుద్దీన్ పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు వెంకటేష్, నాగేష్, జలజ, నరసింహారెడ్డి, శ్రీకాంత్, వెంకటేష్ పాల్గొన్నారు.
- ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ రమేష్ లింగం ఆధ్వర్యంలో శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రామాంజనేయులుగౌడ్, నర్సింహులు, భాగ్యలక్ష్మీ, గోవర్ధన్ శెట్టి, తిమోతి, శ్రీనాథ్, జయరాం, ఆంజనేయులు, రమేష్ పాల్గొన్నారు.
- కేటీదొడ్డి మండలంలోని నందిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీనివాసరామానుజన్ చిత్రపటానికి జీహెచ్‌ఎం మహేష్ పూలమాల వేసి నివాళి అర్పించా రు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహులు, కృష ్ణయ్య, జయరాజు, లక్ష్మణ్‌గౌడ్, మురళీమోహన్, గణేష్, రమాదేవి, రాధికాబాయి, స్వర్ణలత, వెంకట్రాములు పాల్గొన్నారు.
- శ్రీరాఘవేంద్ర ఉన్నత పాఠశాలలో కరస్పాండెంట్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, ఉప న్యాస, క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహు మతులు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేష్, అంజలి, భారతి, నవిత, శిరీష, శారదా, ప్రవీణ్, పావని, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
అసమాన మేధా సంపన్నుడు రామానుజన్
గద్వాల టౌన్ : గణిత శాస్త్రంలో అసమాన మేధా సంపన్నుడు శ్రీనివాస రామానుజన్ అని స్థానిక ప్రియ దర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్‌జే సంపత్‌కుమార్ అన్నారు. గణిత మేధావి రామానుజన్ జయంతిని పురస్కరించుకుని గురువారం కళాశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు జగన్ మోహన్, దేవుజా, సురేష్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, వెంక టేష్, చంద్రశేఖర్, సమత, శారద, లక్ష్మి పాల్గొన్నారు.
- శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా స్థానిక విశిష్ఠ నోబుల్, ప్రగతి విద్యానికేతన్, మాంటి స్సోరి పాఠశాలల్లో విద్యార్థులు గణితశాస్త్ర నమూనాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల కరస్పాడెంట్లు సవా రన్న, రవీంద్రరెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
గణిత శాస్త్రంపై ఆసక్తి పెంచుకోవాలి
ఉండవల్లి : విద్యార్థులు చిన్నప్పటి నుంచే గణిత శాస్త్రంపై ఆసక్తి పెంచుకోవాలని ఎంఈవో శివప్రసాద్ అన్నారు. గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని గురు వారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాలలో రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. విద్యార్థులకు గణిత రంగేళి, గణిత క్విజ్, గణిత శాస్త్రవేత్తల చిత్రాల డ్రాయింగ్, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు. గణిత శాస్త్రవేత్తల ఫోటో గ్యాలరీ ఆకట్టు కుంది. కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయలు వరద సుందర్‌రెడ్డి, వి.మద్దిలేటి, మాధవి, డి.ప్రసన్న, ఉపాధ్యా యులు వెంకటేశ్వర్లు, భరత్‌కుమార్, అరుణ, ప్రభావతి, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రపంచం గర్వించదగ్గ మేధావి
ఇటిక్యాల/ వడ్డేపల్లి/ అయిజ : ప్రపంచం గర్వించదగ్గ మహామేధావి శ్రీనివాస రామానుజన్ అని, మానవ మనుగడ గణిత శాస్త్రంపై ఆధారపడి ఉందని బెటాలి యన్ కమాండెంట్ రాంప్రకాష్ అన్నారు. గణిత దినో త్సవం, శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గురువారం ఎర్రవల్లి చౌరస్తాలోని పదవ బెటాలియంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన గణిత విజ్ఞాన మేళాను ఆయన తిలకించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నాగభూషణం, ఆర్‌ఐలు రాజేష్, రమేష్‌బాబు, శ్రీధర్ పాల్గొన్నారు.
- వడ్డేపల్లి మండల పరిధిలోని రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ప్రధానోపాధ్యాయుడు హారున్ రషీద్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. విద్యార్థు లకు ఉపన్యాసం, క్విజ్, ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు.
- శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా అయిజ పట్టణంతో పాటు యాపదిన్నె ప్రభుత్వ పాఠశా లలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Updated Date - 2022-12-22T23:00:28+05:30 IST