ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ప్రభోత్సవం

ABN, First Publish Date - 2022-12-07T22:52:17+05:30

పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం భక్తుల కోలాహలం మధ్య ప్రభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ప్రభను ముందుకు లాగుతున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మక్తల్‌, డిసెంబరు 7 : పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం భక్తుల కోలాహలం మధ్య ప్రభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయం నుంచి చిన్న రథాన్ని పడమర వైపు ఉన్న చిన్న ఆంజనేయస్వామి ఆలయం వద్దకు లాగి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి యధా స్థానానికి తీసుకువచ్చారు. అంతకు ముందు ఉదయం 5 గంటలకు సుప్రభాతం, 8 గంటలకు పంచామృతం, తులసీ అర్చన, ఆకుపూజ, మహానివేదన, 10 గంటలకు పవమాన హోమం, సాయంత్రం 6 గంటలకు నెమలి వాహనసేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త భీమాచార్య, అర్చకులు ప్రాణేషాచారీ, అరవిందాచారీ, మాన్వి రామారావు, గోవిందరావు, భక్తులు శ్రీనివాసచారీ, అంజన్‌ ప్రసాద్‌, వీహెచ్‌పీ నాయకులు భీంరెడ్డి, సత్యనారాయణగౌడ్‌, వాకిటి రమేష్‌ పాల్గొన్నారు.

ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

మక్తల్‌ రూరల్‌ : పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ సీతయ్య పేర్కొన్నారు. ఒక సీఐతో పాటు పది మంది ఎస్‌ఐలు, 12 మంది ఏఎస్‌ఐలు, 107 మంది పీసీలు, రెండు స్పెషల్‌ పార్టీ పోలీసులతో మొత్తం 130 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మక్తల్‌ పోలీస్‌ స్టేషన్‌లో భద్రత పరమైన సూచనలు చేశారు. జాతర విధులు నిర్వర్తించే పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్‌ఐలు పర్వతాలు, రాములు, సతీష్‌, శ్రీనివాసువు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T22:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising