ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్వకుర్తికి డయాలసిస్‌ సెంటర్‌ మంజూరు

ABN, First Publish Date - 2022-05-25T04:51:35+05:30

కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి డయాలసిస్‌ సెంటర్‌ను మంజూరు అయిందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌ తెలి పా రు.

విద్యానగర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్వకుర్తి, మే 24 : కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి డయాలసిస్‌ సెంటర్‌ను మంజూరు అయిందని  కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌ తెలి పా రు. డయాలసిస్‌ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని దీంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మేలు జరగనుందని తెలిపారు. కల్వకుర్తి పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కల్వకుర్తికి డయాలసిస్‌ కేంద్రాన్ని మం జూరు చేయాలని మంత్రి హరీశ్‌రావును కోరగా, మంజూరు చేశారని తెలి పారు. అదేవిధంగా 50పడకల పీహెచ్‌సీని 100పడకల ఎంపీహెచ్‌ ఆసుప త్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయన్నారు. 100పడక ల ఆసుపత్రి నిర్మాణానికి పట్టణంలోని 99సర్వే నెంబర్‌లో నాలుగెకరాల స్థలాన్ని  కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పట్టణంలో గాంధీనగర్‌కాలనీలో, ఎస్సీ కాలనీలో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏడు మండలాల్లో 35పల్లె దవాఖానాలు మంజూరు చేయనున్నట్లు వివరిం చారు. పేద ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. 

 - పలు పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

 పట్టణంలోని సిల్వర్‌ జూబ్లీ క్లబ్‌ నుంచి బ్రహ్మంగారి గుడి వరకు, విద్యానగర్‌ రోడ్డు నుంచి ఆర్‌అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌ వరకు, కోళ్లబాయి ఎ క్సేన్షన్‌రోడ్డు నుంచి తిలక్‌నగర్‌ దేవరకొండ రోడ్డు వరకు, కన్యకాపరమేశ్వరి దేవాలయ రోడ్డు, ఎల్లికల్‌ రోడ్డు నుంచి ఓల్డ్‌ కల్వకుర్తి వరకు, నాగర్‌ కర్నూల్‌ నుంచి హైటెన్షన్‌ పోల్స్‌ వరకు రూ.2.5కోట్లతో చేపట్టే రోడ్డు విస్తర ణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కల్వకుర్తి పట్టణంలో రూ.32కోట్లతో మిషన్‌భగీరథ పనులు కొన సాగుతున్నాయన్నారు. 12లక్షల లీటర్ల కెపాసిటీ గల ఏడు వాటర్‌ ట్యాంకులను నిర్మిస్తున్నట్లు వివరించారు. ప్రజలకు తాగునీరందించేందుకు అదనంగా మిషన్‌భగీరథకు రూ.27కోట్లు మంజూరు చేయించినట్లు తెలి పారు. ప్రజలకు పది సంవత్సరాల వరకు తాగునీటి ఇబ్బందులు రావని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-25T04:51:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising