ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా అమావాస్య పూజలు

ABN, First Publish Date - 2022-08-28T04:46:34+05:30

శనివారం అమావాస్యతో శ్రావణ మాసం ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలోని శనైశ్చర స్వామి ఆలయం, బాలాజీ మందిర్‌, అయ్యప్ప దేవాలయం భక్తులతో కిటకిటలాడాయి.

కాళబెళగుందెలో బారులు తీరిన భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

నారాయణపేట, ఆగస్టు 27 : శనివారం అమావాస్యతో శ్రావణ మాసం ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలోని శనైశ్చర స్వామి ఆలయం, బాలాజీ మందిర్‌, అయ్యప్ప దేవాలయం భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా భక్తులు శనైశ్చర స్వామికి తైలాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించగా బాలాజీ మందిర్‌లో మూల విరాట్‌కు విద్యాధర్‌ దీక్షిత్‌, మధుసూదన్‌ చారీ పంచామృత అభిషేకం, తులసి అర్చన నిర్వహించారు. అయ్యప్ప ఆలయంలో మూల విరాట్‌కు అర్చకుడు కేదర్‌నాథ్‌ చంధన, భస్మం, పంచామృత అభిషేకం నిర్వహించగా ఆలయ కమిటీ సభ్యులచే భక్తులకు అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో సుఽ దాకర్‌గౌడ్‌, సైదప్ప, ఉమాపతి, బాల్‌రాజ్‌, సురేందర్‌, లింగు పాల్గొన్నారు.

మరికల్‌ : శ్రావణమాసం చివరి శనివారం అమావ్యాస కావడంతో మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరిం చారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైన భజన సంకీర్తన లు ఆదివారం తెల్లవారుజామున రథోత్సవం వరకు కొనసాగించారు. అంతకుముందు అభిషేకం, రుద్రాభిషేకం, ఆకుల పూజ నిర్వహించారు. సాయంత్రం బావి నుంచి జల్ధబిందెతో నీటిని మేళతాలాలు, భజన సంకీర్తనల మధ్య ఊరేగింపుతో ఆలయానికి తీసుకొచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు.

మక్తల్‌ : మక్తల్‌ పట్టణంలోని ఉమామహేశ్వరాలయం వద్ద అమావాస్యను పురస్కరించుకొని 4.30 గంటలకు మహన్యాస పూర్వాభిషేకం అనంతరం స్వామి వారికి  ప్రత్యేక అలంకరణ చేశారు.  మధ్యాహ్నం చిన్న వెం కటేష్‌, పల్లవి దంపతులు  అన్నదానం నిర్వహించారు. అదేవిధంగా థాన్‌సింగ్‌ జన్మదినం సందర్భంగా పడమటి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యం లో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కమిటీ సభ్యులు సత్యనారాయణ, నరేందర్‌, సూర్య ఆంజనేయులు, చిన్న కృష్ణయ్య, అనంతకు మార్‌, నారాయణరెడ్డి, నవీన్‌, సిద్దిరెడ్డి, ప్రవీణ్‌, నాగరాజు, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, నాగప్ప, వెంకటేశ్వర్‌రావు, అంబదాస్‌, విజయ్‌, పృథ్విరాజ్‌, సుకన్య,  అంజన్‌ప్రసాద్‌ పాల్గొన్నారు. 

మాగనూర : మండలంలోని కొత్తపల్లి, వడ్వాట్‌, మాగనూరు గ్రామాల్లో శ్రావణ చివరి శనివారం, అమావాస్యను పురస్కరించుకొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణానది నుంచి జల్దిబిందెతో నీటిని తీసుకొచ్చి స్వామి వారికి జలాభిషేకం, పంచామృతాభిషే కం, మహా మంగళహరతి నిర్వహించారు.  సర్పం చులు రాజు, నర్సిములు, తిమ్మప్ప, ఎంపీపీ శ్యామలమ్మ, ఎంపీటీసీ సభ్యుడు సుదర్శన్‌గౌడ్‌, కృష్ణయ్య, అశోక్‌గౌడ్‌, పురుషోత్తంరెడ్డి, దండు సత్యప్ప, శేఖరప్ప, మహదేవ్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-08-28T04:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising