ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడా రంగానికి ప్రభుత్వం పెద్దపీట

ABN, First Publish Date - 2022-12-16T23:12:46+05:30

క్రీడారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ధరూరు ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-1 క్రికెట్‌ పోటీలను ఆయన ప్రారంభించారు.

బ్యాటింగ్‌ చేసి పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- ధరూరు ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభం

ధరూరు, డిసెంబరు 16 : క్రీడారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ధరూరు ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-1 క్రికెట్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా కారులకు అన్నివిధాలా చేయూతనిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారని తెలిపారు. యువత చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. అనం తరం జట్టు కెప్టెన్లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా జర్సీ లను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు నజు మున్సీసాబేగం, విజయ్‌, జడ్పీటీసీ సభ్యురాలు పద్మ, వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ పద్మమ్మ, ఎంపీటీసీ సభ్యుడు దౌలన్న, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ నరసింహులు, బీఆర్‌ఎస్‌ నాయకులు జాకీర్‌, శ్రీనివాసరెడ్డి, డీఆర్‌ శ్రీధర్‌, పురుషోత్తం రెడ్డి, సంజీయ్‌, భరత్‌, కిష్ణారెడ్డి పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే ధ్యేయం

గట్టు : రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని బోయలగూడెం గ్రామంలో కొనసాగుతున్న లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతరలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన బండ లాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన ఎద్దుల యజమానులకు జ్ఞాపికలను అందించి, సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్‌, వైస్‌ ఎంపీపీ సుమతి, సర్పంచ్‌ రాణి, మాజీ ఎంపీపీ సునీత, బీ ఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, నాయకులు రామాంజనేయులు, వీరేష్‌గౌడ్‌, ఖాసీం పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:12:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising