ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకలు

ABN, First Publish Date - 2022-01-19T05:36:22+05:30

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావుకు భారత రత్న ప్రకటించాలని టీడీపీ సీనియర్‌ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

మహబూబ్‌నగర్‌లో ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌ టౌన్‌, జనవరి 18 : మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావుకు భారత రత్న ప్రకటించాలని టీడీపీ సీనియర్‌ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎన్టీఆర్‌ 26వ వ ర్ధంతి సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయం ముందు ఎన్టీఆర్‌ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ వెంకటయ్యతో కలిసి ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడని కొనియా డారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పేదల ఆకలి తీ ర్చేందుకు 2 రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రాంభించారని గుర్తు చేశా రు. ఆయన ఏర్పాట్లు మండల వ్యవస్థ వల్ల ప్రజల్లో రాజకీయ చైతన్యం వ చ్చిందని కొనియాడారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం భారత రత్న ఇచ్చి గౌరవించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నయ్య, యాదయ్య, శ్రీనివాస్‌, కుమార్‌, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


హన్వాడలో ఘన నివాళి


హన్వాడ, జనవరి 18 : టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ వర్ధంతిని మంగళవారం హన్వాడలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాకి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఖాసీం, నాయకులు మోహన్‌, తి ర్మలయ్య, బందెన్న, వెంకటయ్య, ఆంజనేయులు, కలీం, నర్సిములు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T05:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising