ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యన్మనగండ్ల పెద్ద చెరువుకు గండి

ABN, First Publish Date - 2022-08-09T05:36:44+05:30

మండల పరిధిలోని యన్మన గండ్ల పెద్ద చెరువుకు గండి పండింది.

చెరువు వద్ద వివరాలు తెలుసుకుంటున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవాబ్‌పేట, ఆగస్టు8: మండల పరిధిలోని యన్మన గండ్ల పెద్ద చెరువుకు గండి పండింది.    మూడు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని వివిధ గ్రామా ల్లో ఉన్న నోటిఫైడ్‌ చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. యన్మనగండ్ల పెద్ద చెరువు సైతం పూర్తి స్థాయిలో నిండి అలుగు పారు తుండటంతో అందరు అలుగుల వద్ద చేపలు పట్టేందుకు యువకులు భారీగా తరలి వచ్చారు. అయితే సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో చెరువు కట్ట కమ్మరొళ్ల మాణ్యం వద్ద స్వల్పంగా కోసుకుపోయి నీళ్లు  కిందికి పోతుండటం గమనించిన  రుక్కం పల్లి గ్రామానికి చెందిన రైతు సత్యయ్య తది తరులు చుట్టు పక్కల వారికి సమాచారం ఇచ్చి అందరు వెళ్లి పోవాలని కేకలు వేశారు. దీంతో రైతులు అందరు బయటికి వెళ్లి పోయారు. జుర్కి జంగయ్యకు చెందిన గేదెలు వరద లో కొట్టుకుపోయాయి. సత్యయ్య అనే రైతు మాత్రం తన కుమారుడితో వరద నీటిమధ్యలో చిక్కుకుపోయాడు. ఇదీలా ఉంటే చెరువు తెగిపోయిందన్న సమాచారం తెలుసుకున్న సింగి ల్‌విండో చైర్మన్‌ నర్సింహులు, తహసీల్దార్‌, రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, ఎస్‌ఐ శ్రీకాంత్‌ హుటాహుటిన చెరువువద్దకు చేరుకుని సంఘటన వివరాలు తెలుసుకున్నారు. సుమారు 280ఎకరాల వరిపంట నష్టం కలిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.తమను ప్రభు త్వం ఆదుకోవాలని కోరుతున్నారు. చెరువు పూర్తి స్థాయిలో ఖాళీ  కావడంతో చేపలు నీటి లో కొట్టుకుపో యాయి. మత ్స్య కార్మికులకు రూ. 40లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.  విషయం తెలుసుకున్న ఎస్పీ  ఆర్‌ వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి చేరుకుని  ఎస్‌ఐ శ్రీకాంత్‌, తహసీ ల్దార్‌ రాజేందర్‌రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన నష్టాన్ని అంచన వేసి ఉన్నతాధికారులకు నివేదికలు ఇవ్వనున్నట్లు తహసిల్దార్‌ తెలిపారు.

Updated Date - 2022-08-09T05:36:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising