ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడులకు.. నిధులు

ABN, First Publish Date - 2022-01-24T04:53:04+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాది పొడవున నిర్వహించే కార్యక్రమాలకు తగ్గట్లు అక్కడి విద్యార్థుల సంఖ్యాను గుణంగా నిధులు విడుదల చేస్తారు.

మహబూబ్‌నగర్‌ డీఈవో కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఆరు నెలల తర్వాత ఉమ్మడి జిల్లాకు రూ. 4.66 కోట్లు విడుదల

- మొదటి విడతగా 50 శాతం నిధులు  

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం జనవరి 23 : ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాది పొడవున నిర్వహించే కార్యక్రమాలకు తగ్గట్లు అక్కడి విద్యార్థుల సంఖ్యాను గుణంగా నిధులు విడుదల చేస్తారు. వీటిని ప్రతీ ఏడాది జూన్‌లో స్కూల్‌ గ్రాంట్స్‌  కింద ఎస్‌ఎంసీ (స్కూల్‌ మోనేజ్‌మేంట్‌ కమిటీ ) అకౌంట్స్‌లో జమ చేస్తారు ఈ నిధులను ఎస్‌ఎంసీలతో చర్చించి పాఠశాల అవసరాలకు హెచ్‌ఎం వినియోగించుకుంటారు. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా  అనుకున్న విధంగా నిధులు రావడవంలేదు.  చాలా పాఠశాలల్లో రిపబ్లిక్‌ డే నిర్వహణకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి 50 శాతం నిఽఽధులు విడుదల చేశారు.  2021-2022 విద్యాసంవత్సరానికి సంబంధించిన నిధులు గతేడాది జూన్‌ మాసంలో ఒకే విడతలో విడుదల చేయాల్సిన ఉన్నది. కానీ ఈ ఏడాది జనవరి మొదటి వారం నుంచి విడుదల చేశారని హెచ్‌ఎంలు చేపుతున్నారు.  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,061 ప్రభుత్వ, లోకల్‌ బాడీ పాఠశాల ఖాతాలలో  రూ.4,66,95000  జమ చేశారు. వీటిని అయా పాఠశాల అవసరాలకు స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల ద్వారా వినియోగించాల్సి ఉంటుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత  పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 1 నుంచి 15 మంది ఉంటే  రూ. 12,500,  16 నుంచి 100 వరకు ఉంటే రూ.25వేలు, 101 నుంచి 200 వరకు ఉంటే  రూ.50 వేలు,  250 పైగా ఉంటే రూ.75 వేలు , అం త కంటే ఎక్కువగా ఉంటే లక్ష రూపాయలు నిధులు మంజూరు చేస్తారు.  కానీ ప్రస్తుతం 50శాతం నిధులు మాత్రమే మంజూరు చేశారు. ఈ నిధులను ఎస్‌ ఎంసీ ఆమోదం మేరకే నిధులు వినియోగించాల్సి ఉంటుంది. ఈ నిధులను పాఠశాలలో స్టేషనరి, విద్యుత్‌ బిల్లు, పాఠశాలలో నిర్వహించే జెండా పండుగలు, బడిబాట, ఇంటర్నెట్‌,  శానిటైజేషన్‌ తదితర పాఠశాల అవసరాలకు వినియో గించాల్సి ఉంటుంది. 

  జిల్లా వారీగా మంజూరైన నిధుల వివరాలు 

జిల్లాలు          పాఠశాలలు                  నిధులు 

మహబూబ్‌నగర్‌  817                  1,17,30,000

వనపర్తి           491                 72,45,000

నారయణ పేట         471                 84,17,500 

జోగుళాంబ గద్వాల 459                 87,30,000

నాగర్‌కర్నూల్‌         823                   1,05,72,500  



Updated Date - 2022-01-24T04:53:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising