బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారిపై కేసులు పెట్టండి
ABN, First Publish Date - 2022-12-16T23:41:00+05:30
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు.
- సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కల్పించండి
- శాంతి సమీక్షలో ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు
మహబూబ్‌నగర్, డిసెంబరు 16 : బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. పెట్రోలింగ్ చేసే అధికారులు పాతనేరస్తులతో పాటు కొత్తవారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని చెప్పారు. గ్రామాల్లో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారి శాంతిభద్రతల సమీక్ష నిర్వహించారు. సైబర్ నేరాలకు అమాయకులు బలవు తున్నారని, వారికి విలేజ్ పోలీస్ ఆఫీసర్లు పూర్థిస్థాయిలో అవగాహన కల్పిం చాల్సిన అవసరం ఉందన్నారు. చలికాలంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్ర మాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున వీటిపైనా ప్రజలకు అవగా హన కల్పించాలని, నిరంతర వాహన తనిఖీలు చేపట్టాలని సూచించారు. వివిధ పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసుల దర్యాప్తు తీరును ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. నేరస్థులకు శిక్షపడేలా దర్యాప్తు సాగాలన్నారు. ఇటీవల పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసుల్లో నేరస్థులకు శిక్ష ఖరారుకావడం పట్ల సంబంధిత అధికారులను ఎస్పీ అభినందించారు, వారికి రివార్డ్‌లు ప్రకటించా రు. మున్ముందు శిక్షల శాతం పెరిగేలా అధికారుల దర్యాప్తు సాగాలన్నారు. ఈ కార్యకమ్రంలో అదనపు ఎస్పీ ఏ రాములు, డీఎస్పీలు మహేశ్, రమణారెడ్డి, మధు, ఆదినారాయణ, లక్ష్మణ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:41:04+05:30 IST